Moviesఈ ఫోటోలో నాగార్జున వెనుక ఉన్న వ్యక్తి.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.....

ఈ ఫోటోలో నాగార్జున వెనుక ఉన్న వ్యక్తి.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్షల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే రికార్డులను తిరగరాసిన సినిమాలను డైరెక్ట్ చేసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పచ్చి బూతు సినిమాలను .. దారుణమైన కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందుకే రాంగోపాల్ వర్మ పేరుకి అప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేకుండా పోయింది . అయితే ఉన్న విషయాన్ని ఉన్నట్టు మాట్లాడే రాంగోపాల్ వర్మ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా “శివ”.

ఈ సినిమాలో హీరోగా నటించాడు అక్కినేని నాగార్జున. అప్పుడప్పుడే సినిమాలల్లో సక్సెస్ అవుతున్న నాగార్జున కెరియర్ను తిరగరాసింది ఈ సినిమాఅని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ని అడిగితే నాగార్జున నటించిన సినిమాలలో మొదటిగా అందరూ చెప్పే పేరు “శివ” నే. కాగా ఈ సినిమాలో నాగార్జున వెనక బ్యాక్ గ్రౌండ్లో నటించిన ఓ వ్యక్తి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా ఉన్నాడు . ఆయన మరెవరో కాదు. పూరి జగన్నాథ్..

శివ చిత్రం లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా పూరి జగన్నాథ్ ఆ తర్వాత ఇండస్ట్రీకి ఎన్ని విజయవంతమైన సినిమాలు అందించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బద్రి -అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి- ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం -టెంపర్-పోఖిరి- ఇస్మార్ట్ శంకర్ అలాంటి ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. ప్రెసెంట్ పూరి జగన్నాథ్ టైం అటు ఇటు ఉన్నా.. ఇండస్ట్రీలో ఆయన ద్వారా ఎంట్రీ ఇచ్చిన హీరోలు మాత్రం పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ఈ పిక్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ఈ సినిమాలో జస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ అయినా సరే తన ప్రతిభతో స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు పూరి జగన్నాథ్ . అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి దారుణమైన సిచువేషన్ ఎదుర్కొంటూ ఉండడం బాధాకరమనే చెప్పాలి . ప్రజెంట్ పూరి జగన్నాథ్ “డబుల్ ఇస్మార్ట్ ” అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ తన పేరు కి పునర్ వైభవం వస్తుందని ఆశపడుతున్నారు పూరి జగన్నాథ్ . చూడాలి మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news