Movies"గుంటూరు కారం" నుండి లీకైన క్రేజీ పిక్..టచ్ చేయకూడని మ్యాటర్ లో...

“గుంటూరు కారం” నుండి లీకైన క్రేజీ పిక్..టచ్ చేయకూడని మ్యాటర్ లో ఫింగర్ పెట్టిన త్రివిక్రమ్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా గుంటూరు కారం . ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు అని ఇప్పటికే రిలీజ్ అయిన ఫిక్స్ ఆధారంగా తెలుస్తుంది . కాగా బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ లవ్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది . సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని చూస్ చేసుకున్నట్లు రీసెంట్ గానే బయటపడింది .

కాగ తాజాగా ఈ సినిమా గురించి ఓ పిక్ బయటకు వచ్చింది . ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో కూడా ఉంటుంది అంటూ నిజం చేస్తూ తాజాగా ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకుడిగా ఓ ఫ్లెక్సీలో కనపడుతున్నాడు. ఇది గుంటూరు కారం సినిమాలోని ఓ పోస్టర్గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఫ్లెక్సీలో ప్రజా బంధు జనగలం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైరా వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు ..జన్మదిన పార్టీ యువజన నాయకులు నిజామాబాద్ జిల్లా అని అందులో రాసి ఉంది.

అంటే ఈ పోస్టర్ ఆధారంగా ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో రాజకీయ నేతగా కనిపిస్తారని తెలుస్తుంది . అంతేకాదు ఈ పోస్టర్ చూస్తుంటే నేటి పాలిటిక్స్ లో పొలిటీషియన్ గా కనిపిస్తున్నాడు. అది ఎవరో ఈ పోస్టర్ ద్వారా ఇట్టే జనాలకు అర్థం అయిపోతుంది. అయితే ఇలా టచ్ చేయకూడని పొలిటికల్ మేటర్ లో త్రివిక్రమ్ వేలు పెట్టడమే కాకుండా అది కూడా మహేష్ బాబు సినిమా ద్వారా ఆయన ఇలాంటి ఓ సందేశాన్ని ఇవ్వడానికి రెడీ అవ్వడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అయోమయ స్థితిలో ఉన్నారు .అసలే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. అసలు రాజకీయాలు అంటే పడని మహేష్ బాబు సినిమాలో తన ఫేవరెట్ రాజకీయ నాయకుడు గురించి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news