Moviesలిప్ కిస్ అంటే భయంతో .."అర్జున్ రెడ్డి" లాంటి హిట్ సినిమా...

లిప్ కిస్ అంటే భయంతో ..”అర్జున్ రెడ్డి” లాంటి హిట్ సినిమా వదులుకున్న ఆ తెలుగు హీరో ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

అర్జున్ రెడ్డి .. ఈ పేరు చెప్తూ ఉంటేనే మనకు తెలియకుండా ఏవేవో ఫీలింగ్స్ లోలోపల కలిగిపోతూ ఉంటాయి . మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి . అలాంటి ఓ క్రేజీ హిట్ సినిమా గా రికార్డులు నెలకొల్పింది. మరీ ముఖ్యంగా యువతలో ఈ సినిమా పేరు చెప్తే గూస్ బంప్స్ మోత మోగాల్సిందే.. అలా నిలిచిపోయింది రిజల్ట్. కాగా అప్పటివరకు క్లాస్ అండ్ కూల్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కెరియర్ను రాత్రికి రాత్రి మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి అని చెప్పాలి.

సందీప్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో షాలిని పాండే చాలా బోల్డ్ గా నటించింది . ఎంత బోల్డ్ గా అంటే ఒక ముద్దు అడిగితే పది ముద్దులు పెట్టే అంత బోల్డ్ గా నటించేసింది. అంతేకాదు రాహుల్ రామకృష్ణ , సంజయ్ స్వరూప్ , కమల కామరాజు , కాంచన తదితరులు ఇందులో కీలకపాత్ర పోషించి సినిమాకి మంచి హైప్ ఇచ్చారు . భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ రెడ్డి వంగ.. ఈ సినిమాను నిర్మించారు.

అయితే మొదట ఈ సినిమాలో హీరోగా అనుకుంది విజయ్ దేవరకొండను కాదు అంటూ తెలుస్తుంది. మొదట అనుకున్న హీరో అల్లు అర్జున్ అట . సందీప్ రెడ్డి వంగ మొదట ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ అనుకున్నారట . అయితే సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ ఉండడం నిజంగానే లిప్ కిస్ ఇవ్వాల్సిందే అంటూ డైరెక్టర్ కండిషన్ పెట్టడంతో .. అల్లు అర్జున్ తన ఇమేజ్ ని డ్యామేజ్ అయిపోతుంది అంటూ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట . అంతేకాదు ఆ తర్వాత ఈ కథ శర్వానంద్ వద్దకు కూడా వెళ్ళగా .. సేమ్ రీజన్ తో ఈ కథను అతను కూడా రిజెక్ట్ చేసారట. దీంతో అప్పుడప్పుడే పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండతో సినిమాని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట . ఆ తర్వాత సినిమా రిలీజ్ అయి ఎంత సంచలనాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాలా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news