Moviesబీడి పొగ నచ్చక.. "గుంటూరు కారం" సినిమా మిస్ చేసుకున్న ఆ...

బీడి పొగ నచ్చక.. “గుంటూరు కారం” సినిమా మిస్ చేసుకున్న ఆ పాన్ ఇండియా హీరో ఎవరో తెలిస్తే.. కన్నీళ్ళు ఆగవు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే “గుంటూరు కారం” సినిమా పోస్టర్స్.. గ్లింప్స్ ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న తాజా సినిమా “గుంటూరు కారం”. నిన్న మహేష్ బాబు నాన్నగారు కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్ .

కాగా మొదటి నుంచి జనాలు ఊహించినట్టే సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కబోతుంది అంటూ చిన్న గ్లింప్స్ తోనే క్లారిటీ ఇచ్చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . మరి ముఖ్యంగా “బీడీ కూడా త్రీడీలో కనిపిస్తుందా రా..?” అనే డైలాగ్ అభిమానులకు ఎక్కడో టచ్ చేసింది. ఈ సినిమాలో కూడా పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి జనాలను మెప్పించబోతున్నాడు త్రివిక్రమ్ అంటూ రేంజ్ లో హంగామా చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. కాగా ఇలాంటి క్రమంలోనే ” గుంటూరు కారం” లాంటి మాస్ మసాలా సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో పేరుని ట్రెండ్ చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు .

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.. ఈ కథని అందరికన్నా ముందుగా చెప్పింది గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తారక్ అంటూ తెలుస్తుంది . అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తన వద్దకు తీసుకు రమ్మనడంతో చాలా టైం గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కోరిన విధంగానే స్క్రిప్ట్ లో మార్పులు చేశారట . అయితే ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా కావడం.. పైగా సినిమాలో నాలుగు బూతు పదాలు కూడా ఉండడం ..దానికి తగ్గట్టే బీడీని పదే పదే కాలుస్తూ ఉండాలి అని త్రివిక్రమ్ కండిషన్ పెట్టడంతో ఎన్టీఆర్ ..ఈ సినిమా నుంచి తప్పుకున్నారట . మొదటి నుంచి స్మోకింగ్ అంటే పిచ్చ ఎలర్జీ ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాను స్మోకింగ్ కారణంగానే రిజెక్ట్ చేశాడు అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news