Moviesరాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి సందడి.. పెళ్ళికి హాజరైన ప్రముఖుల లిస్ట్...

రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి సందడి.. పెళ్ళికి హాజరైన ప్రముఖుల లిస్ట్ చూస్తే కళ్ళు జిగేల్.. మనోడి బ్యాక్ గ్రౌండే వేరే లెవల్..!!

సినిమా ఇండస్ట్రీలో రాహుల్ సిప్లిగంజ్ కి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన రేంజ్ ..ఆయన లెవెల్ .. ఆయన జాతకమే మారిపోయింది అని చెప్పాలి. బిగ్బాస్ సీజన్ లో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ..ఏకంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాలో పాడిన నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్నారు.

అంతేకాదు చాలా తక్కువ మందికి దక్కే అరుదైన గౌరవం కూడా రాహుల్ సిప్లిగంజ్ కి దక్కింది . ఆస్కార్ స్టేజిపై ఆయన లైవ్లో పాట పాడి ఇండియన్ సినిమా హిస్టరీని తిరగ రాశారు. తెలుగోడి సత్తా అంటే ఇది అంటూ ప్రూవ్ చేశారు . ఈ క్రమంలోనే రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ లెవెల్ రెండు మారిపోయాయి. రీసెంట్గా రాహుల్ సిప్లిగంజ్ బ్రదర్ నిఖిల్ సిప్లిగంజ్ వివాహం చేసుకున్నారు .

ఈ క్రమంలోనే ఈ వేడుకకు తెలంగాణ అధికార – విపక్ష నాయకులు మొత్తం హాజరయ్యారు . టీఆర్ఎస్ మంత్రులు – హరీష్ రావు – తలసాని శ్రీనివాసరావు తో పాటు మరి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు . అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మరికొందరు రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డు అందుకున్నాక ఆయన రేంజ్ మారిపోయిందని.. ఈ కారణంగానే సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news