Moviesకళ్ళు చెదిరే భారీ విజువల్స్ ..గూస్ బంప్స్ తెప్పిస్తున్న "ఆది పురుష్"...

కళ్ళు చెదిరే భారీ విజువల్స్ ..గూస్ బంప్స్ తెప్పిస్తున్న “ఆది పురుష్” ఫైనల్ ట్రైలర్.. ఇండస్ట్రి రికార్డులు తుక్కు తుక్కు అవ్వాల్సిందే(వీడియో)..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న సాయంత్రం తిరుపతిలో ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిపారు మేకర్స్ . అంతేకాదు ఈవెంట్ కి ఎప్పుడు లేని విధంగా చిన్న జీయర్ స్వామి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు ఆది పురుష్ సినిమాని ట్రోల్ చేసిన ఆకతాయిల నోరులు ముయించేసినట్లయింది.

ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అధ్యంతం అభిమానులను ఎంతో ఆకట్టుకునింది . మరీ ముఖ్యంగా రావణుడు సీతను ఎత్తుకెళ్లిన నేపథ్యంలో సీత కోసం రాముడు సనంధమవ్వడం క్లియర్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే. విధంగా ఓం రావత్ ఈ సినిమాలో చూపించినట్లు ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది అంతేకాదు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్లో ఎమోషనల్ యుద్ధ సన్నివేశాలతో అదరగొట్టేస్తున్నాయి . అంతేకాదు ఈ ట్రైలర్ సినిమాపై మరింత భారీ అంచనాలను పెంచేసింది .

సీతని రావణుడు ఎత్తుకెళ్లిన నేపథ్యంలో రాముడు.. “వస్తున్నారావణ.. సీతని రావణుడు ఎత్తుకెళ్లిన నేపథ్యంలో .. రాముడు.. వస్తున్నా రావణా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి. వస్తున్నా నా జానకిని తీసుకెళ్లడానికి, ఆగమనం. ఆధర్మ విధ్వంసం, కానీ ఈ రోజు నాకోసం పోరాడొద్దు. భరతఖండంలోని స్త్రీలపై చేయి వేయాలని చూసే దుష్టులకి మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నుల్లో వణుకుపుట్టాలి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు, ఆహాంకార రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి” అని రాముడిగా ప్రభాస్‌ చెప్పే డైలాగులు ఆద్యంతం ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

అనంతరం హనుమంతుడు ..”మీరు నాతో వచ్చేయండమ్మా” అని సీతని అడగ్గా..ఆమె సమాధానమిస్తూ..” ఆ గుమ్మంలోకి వచ్చేది రాఘవ తీసుకు వెళ్లినప్పుడే” అనే డైలాగ్‌తోపాటు చివరగా ప్రభాస్‌ చెప్పే.. “నేను వీక్షాకు వంశోద్భావ రాఘవ. మీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశ్యుడినై ఉన్నాను” అని చెప్పడం ఆ ఎమోషన్‌ని పీక్‌లోకి తీసుకెళ్లింది. అంతేకాదు..”పాపం ఎంత బలమైనదైనా, అంతిమ విజయం సత్యానిదే “అని రాముడు రాముడు ఫినిషింగ్ టచ్ ను చాలా రియలిస్టిక్ గా అనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆది పురుష్ ఫైనల్ ట్రైలర్ వైరల్ గా మారింది . మొత్తానికి ఆది పురుష్ తో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు ప్రభాస్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news