Moviesసినిమాలు లేకపోతే ఏం.. నెల తిరిగేసరికి కోట్లు వచ్చే పని స్టార్ట్...

సినిమాలు లేకపోతే ఏం.. నెల తిరిగేసరికి కోట్లు వచ్చే పని స్టార్ట్ చేసిన పూజా హెగ్డే..!?

డబ్బు ఊరికే రాదు ..అది అందరికీ తెలిసిన విషయమే ..లలిత జువెలరీస్ యాడ్లో ఈ డైలాగ్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం . అయితే ఇదే విషయాన్ని బాగా ఫాలో అవుతుంది అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే . ప్రెసెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు లేక అల్లాడిపోతున్న ఈ బ్యూటీ డబ్బు సంపాదించడానికి వేరే మార్గాన్ని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది . గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాక వచ్చిన అవకాశాలు చేజారిపోతూ బాధపడుతున్న ఈ ముద్దుగుమ్మ ..

త్వరలోనే బిజినెస్ వైపు అడుగులు వేయబోతుందట. సంపాదించిన దాన్ని కొంచెం డబ్బులు కొన్ని బిజినెస్ లో పెట్టుబడులు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ..ఈసారి పూర్తిగా బిజినెస్ వైపు అడుగులు వేయబోతుందట . అంతేకాదు పూజా హెగ్డే కి బిజినెస్ వైపు హెల్ప్ చేయబోతున్నాడు అక్కినేని నాగచైతన్య అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్యకు బిజినెస్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఓ వైపు సినిమాల్లో చేస్తూ..మరోవైపు ఎలాంటి బిజినెస్లు మైంటైన్ చేస్తున్నాడో తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు రాక డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదని నిర్ణయంతో పూజ హెగ్డే ఇలాంటి డెసిషన్ తీసుకుందట . దానికి నాగచైతన్య కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఒకవేళ వీళ్ళిద్దరూ సూపర్ సక్సెస్ అయితే ఈ ఫీల్డ్ లోకి మరింత మంది స్టార్ హీరోలు హీరోయిన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news