Moviesబిగ్ షాకింగ్: ఎన్టీఆర్ హీరోయిన్ మారిపోయిందోచ్.. లాస్ట్ మినిట్ లో కొంప...

బిగ్ షాకింగ్: ఎన్టీఆర్ హీరోయిన్ మారిపోయిందోచ్.. లాస్ట్ మినిట్ లో కొంప ముంచేసావు కదా రా డైరెక్టరో..?

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ వరస ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యి బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్నప్పటినుంచి ఎన్టీఆర్ స్థాయి గ్లోబల్ రేంజ్ లో పెరిగిపోయింది . ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్లు కూడా మన ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు .

కాకపోతే ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్క్కుతున్న దేవర సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమా షూట్ అయిపోగానే మరో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి కాల్ షీట్స్ ఇచ్చి సినిమాను తెరకెక్కించడానికి రెడీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ ఎన్టీఆర్ కోసం ఓ హాట్ హీరోయిన్ ని పట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాగా ఎన్టీఆర్ – ప్రశాంత నీల్ దర్శకత్వంలో రాబోయే సినిమాకి సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనే సెలెక్ట్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ప్రశాంత్ నీల్- దీపిక పదుకొనే ప్లేస్ ను ప్రియాంక చోప్రాతో రీప్లేస్ చేశారట. ప్రియాంక చోప్రా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎలాంటి రోల్స్నైనా అవలీలగా నటించేస్తుంది . ప్రెసెంట్ సిటాడిల్ వెబ్ సిరీస్తో గ్లోబల్ స్థాయిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న ప్రియాంక ఈ ప్రాజెక్టులో భాగమైతే ఇంకా పేరు వస్తుందని ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news