Movies"ఆఖరికి మెగాస్టార్ కూడానా..?".. మెగా మనవరాలి విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం..!!

“ఆఖరికి మెగాస్టార్ కూడానా..?”.. మెగా మనవరాలి విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం..!!

మనకు తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు పుట్టింది . గత పదేళ్ళుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. జూన్ 20వ తేదీ 1 : 49 నిమిషాలకు అపోలో హాస్పిటల్స్ లో ఉపాసన పండు లాంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది . ఇప్పుడు ఉపాసన – చరణ్ – పాప అందరు చిరంజీవి ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోని ఇన్నాళ్లకు మనవరాలు పుట్టిన శుభ సందర్భంగా చిరంజీవి ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారట.

సినీ ప్రముఖులు – రాజకీయ ప్రముఖులతో.. పాటు కుటుంబ సభ్యులు సన్నిహితులు.. స్నేహితులు అందరూ ఈ పార్టీకి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది . ఆ రోజే పాప పేరు కూడా రిలీజ్ చేయబోతున్నారు అంటూ తెలుస్తుంది . ఈలోపే చిరంజీవి వేణు స్వామిని ఇంటికి పిలిపించి తన మనవరాలి జాతకం ఎలా ఉండబోతుంది ..? ఎలాంటి పూజలు చేయాలి..? అన్నదానిపై చర్చించబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

ఇన్నాళ్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పిల్లలు లేరు అంటూ అవమానించిన వాళ్లే ఇప్పుడు చరణ్ కి పాప పుట్టింది అని కంగ్రాజులేషన్స్ విషెస్ చెబుతున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది. మొదటి నుంచి ఉపాసన-చరణ్ జాతకాన్ని తూచా తప్పకుండా చెప్పేసిన వేణు స్వామి మెగా మనవరాలు విషయంలో ఏం చెప్తాడు..? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే పాప మహాజాతకురాలు అని చెప్పిన విషయం తెలిసిందే. ఇంకా పూర్తి జాతకం చూసి చెప్పితే బాగుంటుంది అనేది మెగా అభిమానుల కోరిక. చూడాలి మరి ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news