Moviesఅక్కినేని బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా హీరో సుమంత్‌ కెరీర్ నాశ‌నం చేసింది ఎవ‌రు......

అక్కినేని బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా హీరో సుమంత్‌ కెరీర్ నాశ‌నం చేసింది ఎవ‌రు… అస‌లేం జ‌రిగింది…!

అక్కినేని సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు సుమంత్. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్రేమకథ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ మొదటి సినిమాతో అంతగా గుర్తింపు రాక‌పోయినా తర్వాత వచ్చిన యువకుడు, పెళ్లి సంబంధం, సత్యం వంటి సినిమాలతో మంచి సక్సెస్ ను సాధించాడు.

ఇక సూర్య‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌త్యం సినిమా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌. స‌త్యం త‌ర్వాత మ‌ధ్య‌లో వ‌చ్చిన మ‌హానంది సినిమా మిన‌హాయిస్తే త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల‌తో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అయితే తన నటన పర్సనాలిటీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా సుమంత్ హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు.

కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సుమంత్ ఇటీవల మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీరావా, సుబ్రమణ్యపురం లాంటి సూపర్ హిట్ సినిమాలను తన సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత నటించినా సినిమాలు కూడా సుమంత్ కు అంతగా స‌క్ప‌స్ కాలేదు. ఇటీవల కాలంలో హీరోగానే కాక కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సుమంత్.

అసలు విషయానికి వస్తే తనతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఏ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నారో చూస్తున్నాం. అదే టైంలో సుమంత్ ఎన్నో సూపర్ హిట్ స్టోరీలు వదులుకోవడం మంచి కథలను ఎంచుకోలేకపోవడమే అతనికి మైనస్ గా మారిందట‌. సుమంత్ కెరీర్ నాశనం అవ్వడానికి స్టోరీ సెలక్షన్ రాకపోవడం మెయిన్ రీజన్ అంటూ చాలామంది సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news