Moviesమహానటి సావిత్రి అలాంటి పాడు పనులు చేసిందా..? ఆ తప్పే కొంప...

మహానటి సావిత్రి అలాంటి పాడు పనులు చేసిందా..? ఆ తప్పే కొంప ముంచిందా..?

సినిమా ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే . ఈ తరం నటులకు ఈ తరం జనరేషన్ కి ఆమె గురించి తెలియాలి అని ఆమె గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి అని ..నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా మహానటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎలా తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రొమాంటిక్ సీన్ లేకపోయినా .. ఫైట్ లేకపోయినా సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు అభిమానులు .

ఇలాంటి క్రమంలోనే సావిత్రి చేసిన ఓ పాడు పని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే సావిత్రి అంటే అందరికీ ఓ ప్రత్యేకమైన గౌరవం . అప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మహరాణిలా దూసుకుపోతూ ఉన్న సావిత్రి .. జెమినీ గణేషన్ ప్రేమలో పడి తన కెరీయర్ని తన జీవితాన్ని సర్వం నాశనం చేసుకుంది అంటూ అభిమానులు మండిపడుతున్నారు . నిజానికి వాళ్ళ కోపంలో ఆవేశంలో న్యాయం ఉంది.

ఒకవేళ నిజంగా జెమినీ గణేషన్ ని సావిత్రి పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే.. ఆమె కథ వేరేలా ముగిసి ఉండేది . ఆమె పొజిషన్ ఎక్కడికో వెళ్లిపోయిండేది. ఆఖరి రోజుల్లో ట్రీట్మెంట్ కి డబ్బులు లేకుండా హాస్పిటల్లో అనాధ శవంలో పడి ఉండేది కాదు. ఆమె చేసిన తొందరపాటు పని తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగానే సావిత్రి లాస్ట్ లో అంత దారుణమైన చావును ఎదుర్కొంది అంటూ అప్పట్లో వార్తలు రాసుకొచ్చారు. అంతేకాదు సావిత్రి జెమిని గణేశన్ తో బయట తిరగడానికి దొంగ సాకులు చెప్పి షూటింగ్ కూడా డుమ్మ కొట్టారట. దాని ద్వార మేకర్స్ కి నష్టాలు కూడా వచ్చాయట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news