Moviesగుడిలో హగ్గులు-ముద్దులు.. ఓం రౌత్ చేసిన పాపనికి శాపం ఇదే..? చిలుకూరు...

గుడిలో హగ్గులు-ముద్దులు.. ఓం రౌత్ చేసిన పాపనికి శాపం ఇదే..? చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకుడు ఫైర్‌..!!

గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ఆది పురుష్ డైరెక్టర్ ఓం రావత్ ని ఆడేసుకుంటున్నారు జనాలు . మనకు తెలిసిందే తిరుపతిలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఎంత ఘనంగా జరిగిందో. ఈవెంట్ అయిపోయిన పక్క రోజు హీరోయిన్ కృతి సనన్ దర్శకుడు ఓం రావత్.. ప్రొడ్యూసర్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మండప వీధుల్లో కృటి సనన్ ని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు . ఇది సంచలనంగా మారింది.

అంతేకాదు పెద్ద వివాదంగా కూడా మారిపోయింది . ఈ క్రమంలోని ఓం చేసిన పనికి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు . తిరుమల కొండపై ఇలాంటి పాడు పనులు ఏంటి అంటూ ఫైర్ అయిపోయారు . ఆయన మాట్లాడుతూ..” ఆది పురుష్ చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది . అయితే సీతమ్మ పాత్ర పోషించిన అమ్మాయిని దర్శకుడు ఓం రావత్ ముద్దు పెట్టుకోవడం చాలా అపవిత్రంగా భావిస్తున్నాం . స్వామివారి శేష వస్త్రం ధరించి అలా చేయడం తప్పు పని.. అది మనసుకు ఆందోళన కలిగించే విషయమే “.

“తిరుమల కొండపై ఇలాంటి వికారమైన చేష్టలు చేయకూడదు. కళ్యాణం చేయించిన సొంత భార్యాభర్తల అయినా సరే చాలా నియమనిష్టలతో ఉంటారు. అయితే ఓం రావత్ మాత్రమే ఇలా పరాయి స్త్రీని ముద్దు పెట్టుకోవడం అస్సలు బాగోలేదు “అంటూ మండిపడ్డారు. అంతేకాదు కృతి సనన్ సీత దేవి పాత్రకు సెట్ అవ్వదు అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . దీంతో రంగరాజన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . గుడిలో హగ్గులు-ముద్దులు చేసిన ఓం రౌత్ కి ఖచ్చితం గా పాపం తగులుతుందని.. ఆది పురుష్ సినిమా ఫ్లాప్ అవుతుందని జనాలు మండిపడుతున్నారు.అంతేకాదు చాలామంది జనాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు . సీత పాత్రకు కృతి సనన్ సెట్ అవ్వదని అలియాభట్ అయి ఉంటే ఇంకా బాగుండేది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news