Movies"డబ్బుల కోసం అలాంటి పని కూడా చేశా"..సంచలన విషయాని ఓపెన్ గా...

“డబ్బుల కోసం అలాంటి పని కూడా చేశా”..సంచలన విషయాని ఓపెన్ గా బయట పెట్టిన ప్రగతి..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని.. తమ బొమ్మను స్క్రీన్ పై చూసుకోవాలని.. ప్రతి అమ్మాయికి ఉంటుంది . అయితే ఆ కలను కొంతమంది మాత్రమే నిజం చేసుకోగలరు . కొంతమంది ఎంత కష్టపడి తెగించినా సరే ఆ స్థాయికి ఎదగలేరు . అలాంటి వాళ్ళలో ఒకరే నటి ప్రగతి . అమ్మడు అందం గురించి పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ టైం నుంచి సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్ గా మారి సోషల్ మీడియాలో ప్రగతి ఆంటీగా గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి సినిమా ఇండస్ట్రీలో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ పాపులారిటీ దక్కించుకుంది.

కాగా సినిమా ఇండస్ట్రీలో మొదట కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసిన .. . ఈమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది అయితే ఇండస్ట్రీలోకి రాకముందు ఆమెకు మోడలింగ్ చేయాలి అనేది కోరికట . అయితే కొంతమంది ఊరికే తింటున్నావ్ అంటూ కామెంట్లు చేస్తే ఆమెకు నచ్చేది కాదట. ఈ క్రమంలోనే ఆమె డబ్బుల కోసం పిజ్జా హట్ లో కూడా పనిచేసిందట. టెలికాం బూతుల్లో .. ఎస్టిడి బూతుల్లో కూడా పనిచేయాల్సి వచ్చింది అని.. రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది .

కార్టూన్ డబ్బింగ్ కోసం కూడా తాను పనిచేసినట్లు ఆమె క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు మోడలింగ్ లోకి వచ్చాక కూడా కొన్నిసార్లు అలాంటి పనులు కూడా చేసిందట . ఆ రోజు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని కామెంట్ చేయడం గమనార్హం. ప్రగతి మాట్లాడుతూ..” నేను అందగత్తెను కాదు ..ఆ సమయంలో లడ్డు లాగా ఉండేదాన్ని .. ప్రతి వృత్తికి కూడా ఒక అర్హత ఉంటుంది . దానికి ప్రిపేర్ గా ఉండాలి . అయితే హీరోయిన్ గా వచ్చిన అవకాశాలను నేను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను అనుకుంటున్నాను . అందుకే ఇప్పుడు ఇలా మారిపోయాను “అంటూ బోల్డ్ గా స్పందించింది ప్రగతి..!
!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news