Moviesబిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్టార్...

బిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్టార్ యువ నటుడు దుర్మరణం..!!

ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఓ బ్లాక్ డే అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . ఈ క్రమంలోనే ఒక స్టార్ సెలబ్రిటీ చనిపోయాడు అన్న విషాద వార్తల నుండి కోలుకోక ముందే మరో స్టార్ సెలబ్రెటీ మరణించాడు అన్న వార్తలు ఎక్కువగా వింటున్నాం . కాగా తాజాగా అలనాటి మేటి నటీమణి పద్మశ్రీ సులోచన లత్కర్ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఆమె మరణించిన 24 గంటలు కడవకుండానే.. సినీ ఇండస్ట్రీని మరో విషాద వార్త పలకరించింది . సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా పేరు సంపాదించుకున్న కొల్లం సుధీ రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు అందుతున్న వివరాలు ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కొల్లం సుధీ మరణించినట్లు తెలుస్తుంది. ఆయన చేసే మలయాళ టీవీ షోలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి.

యూట్యూబ్లో కూడా వీటికి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా టీవీ ప్రోగ్రాం ముగించుకొని తన తోటి ఆర్టిస్టులతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. వారు ప్రయాణిస్తున్న కారు ఒక గూడ్స్ వెహికల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిన్నత్లు తెలుస్తుంది. కొల్లం సుధీ తలకు బలమైన గాయం తగిలింది . దీంతో వెంటనే హుటాహుటి దగ్గర్లోని కొడుంగలూర్ లో ఓ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. బలమైన గాయం కావడంతో రక్త స్రావం జరిగి కొల్లం సుధీ తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో మలయాళీ చిత్రం పరిశ్రమ మొత్తం దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణానికి పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news