Moviesఆదిపురుష్ సినిమాలో బాల‌య్య డైలాగ్‌...!

ఆదిపురుష్ సినిమాలో బాల‌య్య డైలాగ్‌…!

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. కొందరు విమర్శిస్తున్నప్పటికీ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ బాగానే ఉంది. ఫస్ట్ డే కలెక్షన్లను బట్టి పరిశీలిస్తే ఈ సినిమా త్వరగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో డైలాగ్‌లు కొన్ని మైనస్ అనే విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా మనకు తెలుగు సినిమాలలో ఫ్యాక్షన్ తరహా డైలాగ్‌లు అంటే వెంటనే బాలయ్య గుర్తుకొస్తారు. అందులోనూ ‘నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా’ బాగా అందరికీ తెలిసిన డైలాగ్. ఇదే తరహా డైలాగ్‌ను దర్శకుడు ఓంరౌత్ ఆదిపురుష్ సినిమాలో పెట్టారు. ముఖ్యంగా హనుమంతునితో తైలం ‘నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే’ అనే డైలాగ్‌ను రెగ్యులర్ మాస్ సినిమాల్లో మాదిరిగా ఇందులో పెట్టడం ఓ సెక్షన్ ఆడియన్స్‌కి అస్సలు నచ్చలేదు.

రూ.500ల కోట్లకు పైగా ఆదిపురుష్ సినిమాకు ఖర్చుపెట్టారని టాక్. అయితే ఆ స్థాయిలోనే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా త్రీడీ షాట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. రామాయణం, పురాణాల గురించి ఏ మాత్రం అవగాహన లేని ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. అయితే ఓంరౌత్ పురాణ ఇతిహాసాలతో ప్రయోగాలు చేయకుండా అవెంజర్స్ వంటి సినిమాలు తీయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమా పట్ల వివాదాలు వస్తాయని దర్శకుడు ఓంరౌత్ ముందుగానే ఊహించనట్లుంది. అందుకే సినిమా ప్రారంభంలోనే ఇది తన ఊహలతో తీసిన సినిమా అని పేర్కొన్నాడు. సినిమాలో అన్ని విషయాలు ఎలా ఉన్నప్పటికీ విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ మైనస్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమాకు కొంత మంది ట్రోలింగ్ చేస్తున్నప్పటికీ ఎక్కువ మంది ప్రేక్షకులు పాజిటివ్ అభిప్రాయంతోనే ఉన్నారు. అయితే ప్రజలు ఆరాధించే రాముడి సినిమా కాబట్టి దర్శకుడు మరింత జాగ్రత్తలు ఈ సినిమా విషయంలో తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయాలు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news