Moviesపుష్ప 2 హిట్ కోసం అల్లు అర్జున్ ఇంతలా దిగజారిపోయాడా..? .....

పుష్ప 2 హిట్ కోసం అల్లు అర్జున్ ఇంతలా దిగజారిపోయాడా..? .. ఆయనకి కి ఫోన్ చేసి మరీ విసిగించేస్తున్నాడే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ జనాలు ఎంతో ఈగర్ గా .. ఆశగా వెయిట్ చేస్తున్న సినిమాలలో పుష్ప2 కూడా ఒకటి . ఐకాన్ స్టాల్ అల్లు అర్జున్ నటించిన పుష్ప1 కి ఇది కంటిన్యూవేషన్ గా తెరకెక్కబోతుంది . పుష్ప2 ది రూల్ సినిమా షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తుంది . అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర 20 నిమిషాలకు చనిపోతుందని .. ఆమె పాత్రలోకి మరో హీరోయిన్ రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేసిన పుష్ప2 ది రూరల్ టీజర్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

ఎంతలా అంటే అల్లు అర్జున్ కేవలం పాన్ ఇండియాలోనే కాదు ..గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడు అంటూ నమ్మకాన్ని క్రియేట్ చేసింది . అంత సాలిడ్ బస్ ని క్రియేట్ చేశాడు సుకుమార్ . ఆ విషయంలో సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి .పుష్ప 1 పాన్ ఇండియా లెవల్ లో హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలోని పుష్ప2 తో మరింత హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు అల్లు అర్జున్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు తన సినిమాల విషయంలో ఎవరికీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయని ఎవరు హెల్ప్ తీసుకొని అల్లు అర్జున్ ఫస్ట్ టైం కొరియోగ్రాఫర్ కి ఫోన్ చేసి మరి విసిగిస్తున్నాడట . ఆయనే జానీ మాస్టర్ …

ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్ పేరు ఇండస్ట్రీలో ఎలా వైరల్ అయిందో మనకు బాగా తెలిసిందే . మరీ ముఖ్యంగా కోలీవుడ్లో ఆయన కొరియోగ్రఫీ చేసిన ప్రతి సినిమా బ్లాస్టింగ్ హిట్ అవుతుంది. దీంతో పుష్ప2 సినిమాకి ఆయనే కొరియోగ్రాఫర్ గా ఉండాలి అంటూ పట్టుబట్టి విసిగిస్తున్నాడట . ఈ క్రమంలోనే జానీ మాస్టర్ వరుస కాల్ షీట్స్ తో బిజీగా ఉన్న ఫోన్ చేసి చేసి విసిగించి ఆయనను ఎలాగోలా ఈ సినిమాకి ఒప్పించినట్లు తెలుస్తోంది . దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

మీ సినిమాల విషయంలో ఎప్పుడు నువ్వు చాలా పద్ధతిగా ఉంటావు ..ఎవరికి ఫోన్లు చేయవు.. ఎవరు హెల్ప్ తీసుకోవు.. కాని ఫస్ట్ టైం పుష్ప2 సినిమా కోసం నువ్వు జానీ కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నావా..? నీ స్థాయి ఏంటి ..? అయన స్థాయి ఏంటి ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు సినిమా హిట్ కోసం ఎలాంటి త్యాగమైనా చేయాల్సిందే.. ఎలాంటి పనులైనా చేయాల్సిందే . దానికి అల్లు అర్జున్ కూడా మినహాయింపు కాదు అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news