Movies‘ఉగ్రం’ పబ్లిక్ రివ్యూ: ఉగ్రరూపం చూపించిన అల్లరి నరేష్.. కానీ ,...

‘ఉగ్రం’ పబ్లిక్ రివ్యూ: ఉగ్రరూపం చూపించిన అల్లరి నరేష్.. కానీ , సినిమా మాత్రం..!!

కొంతకాలంగా హిట్లు పడని అల్లరి నరేష్ రీసెంట్గా చేసిన సినిమా “ఉగ్రం”. విజయ్ కనకమేడలా డైరెక్షన్ లో తెరకేక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి యావరేజ్ టాక్ సంపాదించుకుంది . దర్శకుడు విజయ్ కనకమెడలతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆయనతో ఇదివరకే వర్క్ చేసిన ఎక్స్పీరియన్ కారణంగా నరేష్ ఈ సినిమాపై బోలెడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు .

కాగా నాంది సినిమాలు చేయని తప్పకు శిక్ష అనుభవించే అమాయకుడిగా కనిపించిన నరేష్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించారు. నరేష్ ని ఇలాంటి పాత్రలో మనం ఎప్పుడూ చూడలేదని చెప్పాలి . ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ – టీజర్ – ట్రైలర్ ఎంత ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే . కాగా సినిమా రిలీజ్ చేయగానే సీన్ మారిపోయింది సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ అన్ని తానై పోషించాడు అల్లరి నరేష్ .

అయితే దర్శకుడు విజయ్ రాసుకున్న కధ బాగున్న సరే ఆయన కథని జనాలకి చూపించే విషయంలో ఫ్లాప్ అయ్యాడు అంటున్నారు జనాలు . ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సినిమా ఏం బాలేదని అసలు వర్కౌట్ కాలేదని చెప్తున్నారు . అంతేనా సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల వరకు ఏం జరుగుతుందో తెలియక బుర్ర పాడైపోతుందని.. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంటుందని ..మ్యూజిక్ అట్టర్ ప్లాప్ అయిందని …ఫస్ట్ అఫ్ ఫ్లాప్ అయ్యిందని..సెకండ్ హాఫ్ బాగుందని ..మిస్టరీ సాల్వ్ చేయడంలో.. ట్విస్టులు ..ధ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్స్ కలిగిస్తాయి ..మొత్తంగా చూసుకుంటే “నాంది ” సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన విజయ్ కనకమెడల – అల్లరి నరేష్ రెండో సినిమాతో రెండోసారి కూడా హిట్ కొట్టాలి అని ఆలోచించారు . అయితే అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి . చూద్దాం మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news