Moviesఆ స్టార్ భార్యాభర్తలను విడదీసింది త్రివిక్రమ్ నేనా..? ధైర్యంగా బయట పెట్టిన...

ఆ స్టార్ భార్యాభర్తలను విడదీసింది త్రివిక్రమ్ నేనా..? ధైర్యంగా బయట పెట్టిన బండ్ల గణేష్..!!

ఎస్ .. ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హీరోయిన్గా పేరు సంపాదించుకున్న భార్యాభర్తలను విడదీసింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావునే నా అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు. దీనిని కన్ఫర్మ్ చేశాడు బండ్ల గణేష్. ట్విట్టర్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు బడ్ల గణేష్. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ” నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది” అంటూ ఓపెన్ గా కామెంట్ చేశాడు .

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ గురూజీని టార్గెట్ చేస్తూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు. “నువ్వు గురూజీకి ఏదైనా ఖరీదైన గిఫ్ట్ ఇవ్వు. నువ్వు అనుకున్నది ఏదైనా ఇట్టే జరిగిపోతుంది” అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. అంతే కాదు మరో అభిమాని అడుగుతూ..”ఏదైనా కథ చెప్తే దాన్ని తిప్పి తిప్పి మార్చి మార్చి అదే సినిమా ని తెరకెక్కిస్తారట.. నిజమేనా..?” అంటూ అడిగాడు . ఈ క్రమంలోనే బండ్ల గణేష్ దానికి ఘాటుగా బదులిచ్చారు . కాగా ఇంకో అభిమాని అడిగిన ప్రశ్నకు ఘాటైన రేంజ్ లో సమాధానం ఇచ్చాడు బండ్ల ఘనేష్.

“గురూజీ అన్నదమ్ములను .. భార్యాభర్తలను.. తండ్రి కొడుకులను.. గురు శిష్యులను అందరిని .. విడదీసే శక్తి ఉంది . మరి ఆయనకు ఇలాంటివి పెద్ద విషయమా ..?” అంటూ కూసింత ఘాటు గానే స్పందించారు . దీంతో ప్రస్తుతం బండ్ల గణేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీరి మధ్య మరోసారి తీవ్ర స్థాయికి వార్ పీక్స్ కి చేరింది . గతంలో భీంలా నాయక్ ప్రీ రిలీక్ ఈవెంట్ కి బండ్ల గణేష్ ని రాకుండా అడ్డుకున్నింది త్రివిక్రమ్ శ్రీనివాస్ రావే అంటూ అప్పట్లో ఆడియో క్లిప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే . అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య టఫ్ వార్ నెలకొంది . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ దూరం అవడానికి కారణం కూడా గురుజి అంటూ బలంగా చెబుతున్నారు బండ్ల గణేష్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news