Newsకుర్ర హీరోయిన్‌… టాలీవుడ్ స్టార్‌ హీరో క్యాస్టింగ్ కౌచ్ రిలేష‌న్‌…? ఆ...

కుర్ర హీరోయిన్‌… టాలీవుడ్ స్టార్‌ హీరో క్యాస్టింగ్ కౌచ్ రిలేష‌న్‌…? ఆ హీరో, హీరోయిన్లు ఎవ‌రంటే…!

ఆమె టాలీవుడ్ లో ఓ కుర్ర హీరోయిన్ నటించిన సినిమా సూపర్ హిట్ అయింది. అసలు ముందు ఆ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. అయితే అనూహ్యంగా సినిమా హిట్ అవడంతో పాటు సినిమా కొన్న వారందరికీ భారీ లాభాలు తీసుకువచ్చింది. దీనికి కారణం సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ కేవలం ఆ హీరోయిన్ కోసమే ఒకటికి రెండుసార్లు థియేటర్లకు వచ్చారని… అందుకే ఆ సినిమా హిట్ అయిందని రిపోర్టులు వచ్చాయి.

అక్కడి నుంచి ఆమె వరుసగా క్రేజీ కాంబినేషన్లో నటించడం మొదలుపెట్టింది. జూనియర్ హీరోలు, యంగ్ హీరోలు.. చివరకు సీనియర్ హీరోల సినిమాలలోనూ కీలక పాత్రలలో నటిస్తోంది. అసలు ఇప్పుడు ఆమెకు క్షణం తీరికలేదు. చివరకు సండే కూడా కాల్ షీట్లు ఇస్తూ మరి సినిమాలు పూర్తిచేస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టే రేటు కూడా పెంచేసింది. అయితే అలాంటి హీరోయిన్‌కు కుడా క్యాస్టింగ్ కౌచ్ కష్టాలు తప్పడం లేదట.

రీసెంట్గా ఆమె టాలీవుడ్ లో కాస్త యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఒక కుర్ర హీరో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఛాన్స్ రావడానికి ఆ కుర్ర క్రేజీ హీరో ఆమెకు కాస్టింగ్ కౌచ్ కండిషన్ పెట్టాడని తెలుస్తోంది. ఆమెకు ఇప్పుడున్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమా చేయకపోయినా వచ్చిన నష్టం లేదు. అయితే యూత్లో క్రేజ్ ఉన్న హీరో.. ఛాన్స్ వదులుకుంటే మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో ? రాదో అన్న ఉద్దేశంతో కాస్త తట పటాయించినా ఎట్టకేలకు ఆ క్రేజీ హీరోయిన్ ఆ కుర్ర హీరోకు జోడిగా నటించడానికి ఓకే చెప్పిందట.

ఆ కుర్ర హీరోపై ఇప్పటికే తన సినిమాల్లో నటించే హీరోయిన్ల విషయంలో కాస్టింగ్ కౌచ్ కండిషన్లు పెడతాడు అన్న గాసిప్‌లు అయితే టాలీవుడ్ వర్గాల్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు తన కొత్త సినిమా హీరోయిన్ విషయంలోనూ అదే కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఆ హీరోయిన్ కూడా ఏదైతే అదే అవుతుంది అని క్రేజ్ ఉండగానే నాలుగు ఛాన్సులు పట్టుకోవాలి.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అన్న చందంగా ఈ సినిమాకు ఓకే చెప్పిందని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news