Moviesఫైమా లవర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదే.. ఫుల్...

ఫైమా లవర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ..!!

ఫైమా.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాల అవసరం లేదు . జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన స్టైల్ లో కామెడీని పండించి.. హ్యూజ్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది . కాగా పటాస్ షో తో ఫైమా పేరు లైం లైట్ లోకి వచ్చింది . ఆ తర్వాత క్రమీనా జబర్దస్త్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో వల్గర్ పంచెస్ వేస్తూ బూతు పదాలను అవలీలగా మాట్లాడేస్తూ ఫైమా పాపులారిటీ సంపాదించుకుంది . ఆ పాపులారిటి కారణంగా బిగ్బాస్ సీజన్ స్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన స్టైల్ లో గేమ్ ని ఆడి ..దాదాపు పది వారాలకు పైగానే హౌస్ లో ఉన్నింది.

ఈ క్రమంలోనే ప్రవీణ్ అనే కమెడియన్ ని ప్రేమిస్తున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . జబర్దస్త్ లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫైమా-ప్రవీణ్ వీళ్ళిద్దరి ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్ గా ప్రవీణ్ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు . వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్న ఆ ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే ఫైమా ప్రవీణ్ ల మధ్య యవ్వారం చెడిందని .. ఆ కారణంగానే ఫైమాను వదిలేసి ప్రవీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

అయితే దీనిపై ప్రవీణ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రవీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి ..? అంటూ జనాలు మండిపడిపోతున్న క్రమంలో ప్రవీణ్ స్పందించాడు . కొమరం యూట్యూబ్ ఛానల్ కోసం చేసిన వీడియో తప్పిస్తే అది నిజంగా జరిగిన వివాహం కాదని .. తన లైఫ్ లో ఫైమ తప్ప మరి వేరే ఎవరు లేరని చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే అభిమానులు ఫుల్ రేంజ్ లో ఆయనను అభినందిస్తున్నారు. ప్రవీణ్ -ఫైమ ఎప్పటికీ ఒకటిగానే ఉంటారు అని.. వాళ్ళది ట్రూ లవ్ అని చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే పేదరికంలో పుట్టిన ఫైమ శక్తితో ఎదిగిన తీరుని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు . త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న ..దానిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ జంట. ప్రేమ అయితే ఉంది కాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు వీళ్ళకే తెలియాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news