Moviesబాహుబలి : తమన్నా పాత్రను చేతుల్లారా మిస్ చేసుకున్న ఆ స్టార్...

బాహుబలి : తమన్నా పాత్రను చేతుల్లారా మిస్ చేసుకున్న ఆ స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా..దరిద్రం అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం . ఇది ఓ మాయాలోకం .. ఎప్పుడు ఏం జరుగుతుందో ..ఎవరు గెస్ చేయలేని పరిస్థితి నెలకొంటూ ఉంటుంది . అప్పటివరకు స్టార్ గా ఉన్న స్టార్ జీరో గా మారడం జీరోగా ఉన్న స్టార్ హీరోగా మారడం రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటాయి. ఒక్క సినిమాతోనే తలరాతను మార్చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ తమన్నా . కెరియర్ లో ఇప్పటివరకు ఆమె నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ చాలా వరకు వేరే హీరోయిన్స్ ని అనుకోని మిస్ చేసుకున్న సినిమాలే..

హ్యాపీడేస్ సినిమాలో మధు పాత్రకి కూడా ముందుగా వేరే అమ్మాయిని అనుకున్నారట . ఆ తర్వాత శేఖర్ కమ్ముల – తమన్నాను చూసి ఇంప్రెస్ అయ్యి .. ఆ పాత్రకు ఆమెని సెలెక్ట్ చేశారు. అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తమన్నా కి సంబంధించి వైరల్ గా మారింది . టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ రాశి ఖన్నా ఆట . ఈ విషయాన్ని స్వయాన రాజమౌళి నే చెప్పుకొచ్చాడు .

అయితే రాశి ఖన్నా కి వాటర్ అంటే భయం అని ..వాటర్ షార్ట్స్ చేయలేని చెప్పడంతో రాజమౌళి ఆమెను సినిమా నుంచి తప్పించి తమన్నాను ఓకే చేశారట . ఈ సినిమా తర్వాత తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాహుబలి సినిమా తర్వాత తమన్నా సినీ ఇండస్ట్రీని అల్లాడించేసింది. టాలీవుడ్ – బాలీవుడ్ – కోలీవుడ్ లో లో వరుస అవకాశాలు అందుకొని క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమైంది . ప్రజెంట్ తమన్న – చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news