Movies"నరేష్ లో నాకు బాగా నచ్చింది అదే".. పవిత్ర బోల్డ్ కామెంట్స్...

“నరేష్ లో నాకు బాగా నచ్చింది అదే”.. పవిత్ర బోల్డ్ కామెంట్స్ వింటే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

నవరసరాయుడిగా పేరు సంపాదించుకున్న నరేష్ – పవిత్ర లోకేష్ పేర్లు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు డేటింగ్ చేస్తున్నారు.. పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ అయితే వీళ్ళిద్దరూ జంటగా నటించిన ” మళ్ళీ పెళ్లి ” సినిమాపై హ్యూజ్ భజ్ ని క్రియేట్ చేస్తున్నారు . యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పవిత్ర లోకేష్ హీరోయిన్గా నటిస్తూ ఉండడం గమనార్హం .

మే 26న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు పవిత్ర నరేష్ . ఈ క్రమంలోనే రీసెంట్గా మీడియాతో ఇంటరాక్ట్ అయిన పవిత్ర తన మనసులోని సంగతులను బయటపెట్టింది . ఈ క్రమంలోనే మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఓపికగా సమాధానం ఇచ్చింది. చాలా విరామం తర్వాత మళ్లీ పెళ్లిలో మళ్లీ హీరోయిన్గా చేయడం ఎలా అనిపించింది ..? అంటూ రిపోర్టర్స్ అడిగారు.

ఈ క్రమంలోని నా కెరియర్ ప్రారంభం నుంచి పాత్రలపై దృష్టి పెట్టాను.. కానీ హీరోయిన్గా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు ..ఇప్పటికీ ఆ అదృష్టం నాకు దక్కింది ..నచ్చిన పాత్రలు చేసుకుంటూ వచ్చాను.. ఇప్పుడు మళ్లీ పెళ్లిలో ప్రధానపాత్ర పోషిస్తున్నాను. నరేష్ గారు చెప్పినట్లు హీరో హీరోయిన్ అనుకుంటే హీరో హీరోయిన్ అనుకోవచ్చు ..ఎలా కన్సిడర్ చేస్తారు అన్నది మొత్తం మీ ఇష్టానికి వదిలేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు ఇందులో బోల్ట్ కంటెంట్ ఉంటుందని రాజు గారు చెప్పారు..?. అంటూ ప్రశ్నించిన రిపోర్టర్ కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది పవిత్ర . “మనం సమాజంలో కొన్ని కండిషన్స్ పెట్టుకొని ఉంటాం.. దానిని దాటితే బోల్డ్ అంటారు. అలా అయితే ఈ సినిమా లో బోల్డ్ గానే ఉంటుంది అంటూ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది.

నరేష్ గారిలో మీకు నచ్చిన లక్షణాలు ?.. నరేష్ గారు ఎంత సీరియస్ విషయాన్ని అయినా చాలా లైట్ తీసుకొని దానికి ఏం కావాలో చాలా సీరియస్ గా చేస్తారు. అది నాకు చాలా ఇష్తం. నేను చిన్న చిన్న విషయాలని కూడా సీరియస్ గా తీసుకుంటాను. నరేశ్ గారు ఈ రోజు గురించే ఆలోచిస్తారు. ఈ రోజు తమకి ఉన్నదాంట్లో సంతోషంగా వుండాలని అనుకుంటారు. రేపు అనేది రాని చూసుకుందామంటారు. ఈ క్యాలిటీ ఆయనలో నేర్చుకున్నాను. అన్నిటికన్నా ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీని కంటే కావాల్సింది ఏముంది. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news