Newsనాగ‌చైత‌న్య నెత్తిన పెద్ద బండ ప‌డేశారే… ' క‌స్ట‌డీ ' ప్రి...

నాగ‌చైత‌న్య నెత్తిన పెద్ద బండ ప‌డేశారే… ‘ క‌స్ట‌డీ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌.. టార్గెట్ ఎన్ని కోట్లంటే…!

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప‌రంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ప్రేమమ్ సినిమాతో నాగ‌చైత‌న్య మార్కెట్ రు. 30 కోట్లు దాటేసింది. ఆ త‌ర్వాత హిట్లు ప‌డినా చైతు మార్కెట్ మాత్రం పెర‌గ‌లేదు. ఇక బంగార్రాజు సినిమా మాత్రం రు. 50 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయ‌నాకు సీక్వెల్‌గా రావ‌డంతో పాటు అటు నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌, కృతిశెట్టి లాంటి స్టార్ కాస్టింగ్ ఉండ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టెక్కేసింది.

ఆ త‌ర్వాత చైతు చేస్తోన్న సినిమాలు వ‌రుస‌గా ప్లాపులు అవుతుండ‌డంతో చైతు మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. థ్యాంక్యూ సినిమా ఘోరంగా బాల్చి త‌న్నేసింది. ఇక అమీర్‌ఖాన్‌తో చేసిన లాల్‌సింగ్ చ‌ద్దా కూడా పెద్ద డిజాస్ట‌రే. ఇక తాజాగా చైతు హీరోగా త‌మిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కాప్ యాక్షన్ డ్రామా కస్టడీ. ఈ సినిమాలోనూ చైతుకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా టీజ‌ర్‌, ప్ర‌చార చిత్రాలు, ట్రైల‌ర్ మాత్రం ప్రామీసింగ్‌గా అనిపించాయి. ఈ సినిమా రేపు శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 22 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. చైతు ఇప్పుడు ఫామ్‌తో పోల్చి చూసినా.. అత‌డి తాజా సినిమాల వ‌సూళ్లు చూసినా ఇది పెద్ద టార్గెట్టే అని చెప్పాలి.

అయితే సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌స్తేనే ఈ రు. 22 కోట్ల టార్గెట్ చాలా సులువుగా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా అయితే చైతు నెత్తిన మేక‌ర్స్ పెద్ద బండే పెట్టారు. యావ‌రేజ్ టాక్‌తో అయినా ఈ వ‌సూళ్లు దాట‌డం కాస్త క‌ష్ట‌మే. సినిమా అదిరిపోయింద‌న్న టాక్ తెచ్చుకోవాలి. అరవింద్ స్వామి ఈ సినిమాలో విలన్ కాగా ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాత‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news