Movies"కస్టడి" పబ్లిక్ రివ్యూ: అక్కినేని ఫ్యాన్స్ కి పండగ.. మిగతా వాళ్లకి...

“కస్టడి” పబ్లిక్ రివ్యూ: అక్కినేని ఫ్యాన్స్ కి పండగ.. మిగతా వాళ్లకి దండగ..!!

టాలీవుడ్ యంగ్ హీరో గా పాపులారిటీ సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య .. రీసెంట్ గా నటించిన సినిమా “కస్టడి”. తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే తెలుగు-తమిళ భాషలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది . ఈ సినిమా చూసిన జనాలు ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ని చెప్పుతూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు .

మరీ ముఖ్యంగా వెంకట్ ప్రభు దర్శకత్వంపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన అభిమానులకు కూసింత నిరాశ తప్పదనే అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా గతంలో వెంకట్ ప్రభు తీసిన సినిమాలకు ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే కథ పరంగా కంటెంట్ పరంగా అభిమానుల్ని ఎక్కడ నిరాశ పడకుండా ముందుకు తీసుకెళ్లాడు . “శివ” అనే క్యారెక్టర్ చుట్టే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది అంటూ ముందే చెప్పుకొచ్చాడు వెంకట్ ప్రభు.

కాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది . శివ క్యారెక్టర్ ఈ సినిమాకి కర్త-కర్మ-క్రియ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు రేవతి-శివ లవ్ స్టోరీ కూడా బాగా వర్క్ అయిందని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ గా ఉంటుందని ..సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇన్వెస్టిగేషన్స్ ..అరవింద్ స్వామికి – శివ క్యారెక్టర్ కి ఎలా లింక్ పడింది అనేది డిఫరెంట్ గా మ్యాచ్ చేశాడు డైరెక్టర్ .

సంగీతం పరంగా కూడా ఇళయరాజా యువన్ శంకర్ రాజా సక్సెస్ అయ్యారు . కాగా మొత్తంగా అటు కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా..కామెడి, లవ్, ఫన్ , సస్పెన్స్ అన్ని కలగలసిన సినిమానే “కస్టడి”. కస్టడి సినిమా యావరేజ్ టాక్ దక్కించుకుంది .అంతేకాదు నాగ చైతన్య పర్ఫామెన్స్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా చూడచ్చని .. వాళ్లకైతే ఈ సినిమా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయని .. మిగతా జనాలకు ఈ సినిమా పెద్దగా బుర్రకు ఎక్కదని ..ఏదో చూసామా ఎంజాయ్ చేసామా అన్న విధంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు . దీంతో కొన్ని ప్లస్లు కొన్ని నెగటివ్ కామెంట్స్ తో అక్కినేని నాగచైతన్య సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ అవుతుంది. చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news