News"భోళా శంకర్‌" కోసం అలాంటి పని చేసిన చిరంజీవి.. కొత్త లుక్‌...

“భోళా శంకర్‌” కోసం అలాంటి పని చేసిన చిరంజీవి.. కొత్త లుక్‌ లో కేకపెట్టిస్తున్నావ్ కదా బాసూ..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా “భోళా శంకర్”. వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి .. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆయనకు చెల్లెలు పాత్రలు నటిస్తూ ఉండగా ..శ్రియ శరణ్ ఈ సినిమాలో కీలకపాత్ర నటిస్తున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు ఈ సినిమాలో తమన్నా భాటియా ఆయనకు జోడిగా నటిస్తుంది . ఈ క్రమంలోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మెగా అభిమానులకు ఒక్కొక్క అప్డేట్ సరికొత్త గూస్ బప్స్ తెపిస్తుంది . ఈ క్రమంలోనే నేడు మేడే సందర్భంగా “భోళా శంకర్ ” సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఇందులో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది .

కారు వద్ద స్టైల్ గా నిలబడి కనిపిస్తున్న చిరంజీవి పిక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది . బ్లూ కలర్ డ్రెస్ లో చిరంజీవి కనిపించాడు చిరు. ఈ క్రమంలోని ఇంద్ర నాటి చిరంజీవిని మరోసారి అభిమానులకు గుర్తు చేశాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ క్రమంలోని సినిమాకి సంబంధించిన ఈ లుక్ ప్రెసెంట్ వైరల్ గా మారింది. కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో చాలా లావిష్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసుకునింది. ఇటీవల హైదరాబాద్ లో భారీ హై యాక్షన్ సీక్వెన్స్ షూట్ కూడా ఫినిష్ చేశారట . త్వరలోనే మిగతా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని అనుకున్న టైం కి సినిమా రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది భోళా శంకర్ టీం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news