Newsబిగ్ బ్రేకింగ్: మరికొద్ది గంటల్లో "కస్టడి" రిలీజ్.. నాగచైతన్య కి కోలుకోలేని...

బిగ్ బ్రేకింగ్: మరికొద్ది గంటల్లో “కస్టడి” రిలీజ్.. నాగచైతన్య కి కోలుకోలేని షాక్..?!

టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ గా నటించిన సినిమా కస్టడి . తమిళ్ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్గా నటించింది . వరుసగా ఫ్లాప్ లతో అల్లాడిపోతున్న నాగచైతన్య తన హోప్స్ అని ఈ సినిమా పైన పెట్టుకుని ఉన్నాడు . ఈ సినిమాలో సరికొత్త డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు నాగచైతన్య అంటూ ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది .

అంతేకాదు ఈ సినిమాలో ప్రియమణి కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . కాగా ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అక్కినేని అభిమానులు ఇప్పటికే థియేటర్ వద్ద హంగామా స్టార్ట్ చేశారు . భారీ కటౌట్లతో.. ఫ్లెక్సీలతో.. పాల్భిషేకాలతో.. పూలదండలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే నాగచైతన్య కస్టడీ సినిమా హిట్ అవ్వాలి అంటూ ఫ్యాన్స్ ఎన్నో పూజలు చేశారు.. ఎంతో హంగామా చేశారు .

అయితే నాగచైతన్య సినిమాకి నెగటివ్ రివ్యూ ఇవ్వడానికి కొందరు ఇప్పటికే థియేటర్స్ వద్ద చేరుకున్నారట. అంతేకాదు నాగచైతన్య సినిమా డిజాస్టర్ అవ్వాలని సినిమా బాగున్న బాగా లేకపోయినా అలాంటిఓ టాక్ ఇచ్చి సమంత శాకుంతలం ఫ్లాప్ అయినట్లే నాగచైతన్య కస్టడి సినిమా కూడా ఫ్లాప్ అవ్వాలి అని కొందరు ఆకతాయిలు ట్రై చేస్తున్నారట . అందుకే కావాలని ఇప్పటికే సినిమాకి సంబంధించి కొన్ని నెగటివ్ పాయింట్స్ ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో నాగచైతన్య కస్టడి సినిమాకి నెగటివ్ టాక్ ని క్రియేట్ చేశారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . సినిమా బాగుందంటే బాగుందని చెప్పాలి ..లేదంటే బాగా లేదని చెప్పాలి.. ఇలా రిలీజ్ అవ్వకముందే కావాలని మనసులో ఏదో పెట్టుకుని నెగటివ్ టాక్ క్రియేట్ చేస్తే ఎలా..? అంటూ ఫైర్ అవుతున్నారు . దీంతో నాగచైతన్య సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో అని అంత ఫాన్స్ టెన్షన్ టెన్షన్ పడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news