Newsఆ టాలీవుడ్ కుర్ర హీరో కోసం మొత్తం బ‌య‌ట పెట్టేస్తోన్న జాన్వీ…...

ఆ టాలీవుడ్ కుర్ర హీరో కోసం మొత్తం బ‌య‌ట పెట్టేస్తోన్న జాన్వీ… క్రేజీ ఆఫ‌ర్ ఇది..!

దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎప్పుడు తెలుగులో నటిస్తుందా.. అని తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ప్రేమికులు అందరూ కళ్ళు కాయలు కాచేలా నాలుగైదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. వీరి ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఎన్టీఆర్ 30వ సినిమాతో ఆమె టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. అలాగే సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే జాన్వీ కపూర్ కి ఇది తొలి సినిమా.

ఈ ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలోనూ ఆమెను హీరోయిన్గా తీసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం డిస్కషన్లు నడుస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తెలుగులో జాన్వీ మూడో సినిమా గురించి మరో న్యూస్ తెరపైకి వచ్చింది. ఈసారి కుర్ర హీరోతో జాన్వి రొమాన్స్ చేయనుంది.

అఖిల్ అక్కినేని తాజాగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. అఖిల్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాతో సాహో సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అఖిల్‌కు ఇప్పటికే అనిల్ కుమార్ స్టోరీ నెరేట్ చేసి ఓకే చేయించుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏజెంట్ సినిమా ఫెయిల్యూర్ నుంచి బయట పడేందుకు అఖిల్ విదేశాలకు వెళ్ళాడు. అఖిల్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా జాన్వికపూర్ ని హీరోయిన్గా తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది.

జాన్వి అలా తెలుగులో ఎంట్రీ ఇచ్చిందో లేదో అందాలు చూపించే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. ఇక తాజాగా ఆమె ఫోటో షూట్ లు చూస్తుంటే అఖిల్ సినిమాలో మాత్రమే కాదు.. ఇక్కడ స్టార్ హీరోలు అందరి సరసన ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చేలా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news