Newsపాపం… క్రేజ్ త‌గ్గిపోయాక అనుష్క‌కు ఎన్ని క‌ష్టాలు…!

పాపం… క్రేజ్ త‌గ్గిపోయాక అనుష్క‌కు ఎన్ని క‌ష్టాలు…!

అనుష్క శెట్టి సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని దాదాపు ప‌దేళ్ల‌కు పైగా ఓ ఊపు ఊపేసింది. ఇటు తెలుగుతో పాటు అటు త‌మిళంలోనూ స్టార్ హీరోలు అంద‌రితోనూ క‌లిసి న‌టించి సూప‌ర్ హిట్లు కొట్టేసింది. ఒకానొక టైంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రావ‌డంతో అస‌లు అనుష్క షెడ్యూల్ ఖాళీ ఉండేదే కాదు. అంత బిజీ హీరోయిన్‌గా ఉండేది.

బాహుబ‌లి సీరిస్ సినిమాల కోసం ఆమె ఏకంగా మూడేళ్ల పాటు టైం స్పెండ్ చేసింది. అక్క‌డ ఆమె లాక్ అయిపోవ‌డంతో ఆమె కెరీర్ ఆ సినిమాల‌తోనే దాదాపు ముగిసిపోయిన‌ట్ల‌య్యింది. మ‌ధ్య‌లో సైజ్ జీరో అనే చెత్త సినిమా కోసం ఆమె చేసిన త్యాగం ఆమె కెరీర్‌కు ఎండ్ కార్డు వేసేసింది. ఆ సినిమా కోసం అనుష్క చాలా లావుగా మారిపోయింది.

చాలా బొద్దుగా ఉన్న అనుష్క ఆ త‌ర్వాత త‌గ్గేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు వ‌ర్క‌వుట్ కాలేదు. ఆమె ఫిజిక్ మొత్తం మారిపోయింది. ఇక చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత అనుష్క ఓ సినిమా చేస్తోంది. యూవీ సంస్థ నవీన్ పోలిశెట్టి-అనుష్క కాంబినేషన్ లో నిర్మిస్తున్న శెట్టి-శెట్టి సినిమా టీజర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌న్న‌ది క్లారిటీ లేదు.

ఈ నెల 26న అంటున్నారు. సినిమా రెడీ. అనుష్క కోప‌రేట్ చేస్తోంది. అయితే ఆమె బాడీ షేపింగ్ ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింద‌ట‌. ఎంత సీజీ వ‌ర్క్ చేస్తున్నా క‌వ‌ర్ చేయ‌లేక‌పోతున్నార‌ట‌. అనుష్క శ‌రీరం బాగా లావుగా మారింది. ముఖ్యంగా ఫేస్ కూడా బాగా చబ్బీగా ఉంది. ఈ సీజీ వ‌ర్క్‌కే చాలా టైం ప‌డుతోంది.. ఇక మే 26 వ‌ర‌కు ఈ సినిమా రిలీజ్ అయ్యే ప‌రిస్థితి లేదు.

ఆ త‌ర్వాత ప్ర‌భాస్ ఆదిపురుష్‌, ప‌వ‌న్‌- సాయితేజ్ సినిమాలు, భోళాశంక‌ర్‌.. ఇలా ఆగ‌స్టు వ‌ర‌కు పెద్ద సినిమాలు ఉన్నాయి. ద‌స‌రాకు పెద్ద సినిమాలే. ఏదేమైనా అనుష్క శ‌రీరం మారిపోయాక ఆమెకు, ఆమకు రాక‌రాక వ‌చ్చిన సినిమాకు ఇంత పెద్ద క‌ష్టం త‌ప్ప‌ట్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news