Moviesసినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ సిస్టర్.. అబ్బబ్బా ఎంత...

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ సిస్టర్.. అబ్బబ్బా ఎంత అందంగా ఉందో.. చూపుతిప్పుకోలేరు..!!

టాలీవుడ్ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఆమె లాస్ట్ గా నటించిన దసరా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే. ఈ సినిమాలో అమ్మడు నేచురల్ యాక్టింగ్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మొదటి నుంచి నాచురల్ యాక్టింగ్ అంటే ఇష్టపడే కీర్తి సురేష్ .. రీసెంట్గా అభిమానులకు ఎగిరి గంతేసిన న్యూస్ చెప్పింది .

కాగ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఫ్రెండ్ తో దిగిన ఫోటోను షేర్ చేసిన కీర్తి సురేష్ ..ఆమెకు కాబోయే భర్త అంటూ జనాలు ప్రచారం చేశారు. దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే ఎట్టకేలకు దానిపై క్లారిటీ ఇచ్చి అతను నా ఫ్రెండ్ అంటూ కీర్తి సురేష్
చెప్పుకొచ్చింది. తాజాగా మరో గుడ్ న్యూస్ ని అభిమానులకి అందించింది కీర్తి సురేష్.

సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న కీర్తి సురేష్ అక్క సినిమా ఇండస్ట్రీలోకి కాళ్లు మోప్పింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కీర్తి సురేష్. కీర్తి సురేష్ అక్క రేవతి సినీ ఇండస్ట్రీలోకి దర్శకురాలుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది . మలయాళం లో థాంక్యూ అనే ఒక షార్ట్ ఫిలిం ద్వారా కీర్తి సురేష్ అక్క తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసింది. కీర్తి సురేష్ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది .

కాగా సురేష్ కుమార్ నితిన్ మోహన్ ఈ షార్ట్ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నట్లు పోస్టర్లు ఆధారంగా తెలుస్తుంది. పోస్టర్లో రెండు జతలు చెప్పులను పెట్టారు . అలాగే థాంక్యూ టైటిల్ తో టీ కప్ సింబల్ ని కూడా ఎలివేట్ చేశారు. ఈ విధంగా డిజైన్ చేయడంతో ఆమె క్రియేటివిటీ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు అక్కను ప్రమోట్ చేయడానికి కీర్తి సురేష్ స్థాయి శక్తుల ప్రయత్నిస్తుందట . త్వరలోనే అక్క డైరెక్షన్లో కీర్తి సురేష్ హీరోయిన్ గా సినిమాలో నటించిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news