Moviesభార్యలను కాదని పరాయి ఆడదానిపై మోజు పడిన స్టార్ హీరోలు వీళ్లే..!

భార్యలను కాదని పరాయి ఆడదానిపై మోజు పడిన స్టార్ హీరోలు వీళ్లే..!

ఒకడే రాముడు.. ఒకరే సీత.. ఒకటే బాణం అన్నట్టుగా మనం హిందూ సాంప్రదాయం చెబుతూ ఉంటుంది. కానీ ఇటీవ‌ల కాలంలో చాలామంది భార్య ఉండగానే మరొక ఆడదానిపై మోజు పడుతూ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఈ గ్లామర్ ప్రపంచంలో అలా భార్య ఉన్నా సరే పరాయి ఆడదానిపై మోజుపడిన స్టార్ హీరోలు కూడా చాలామంది ఉన్నారని చెప్పాలి. మరి వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

నరేష్:
భార్య ఉండగానే ఇంకొక ఆడదానిపై మోజు పడ్డ వారిలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వీకే నరేష్. ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్న వీకే నరేష్ మళ్లీ పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లో నిలుస్తున్నాడు.

జెమినీ గణేషన్:
ప్రముఖ తమిళ హీరో జెమినీ గణేషన్ కూడా సావిత్రితో ముందు ఎఫైర్ నడిపాడు. అయితే అప్పటికి ఆయనకు అలివేలుతో వివాహం జరిగి పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆ విషయం సావిత్రికి తెలియదు. ఇక సావిత్రిని రహస్యంగా వివాహం చేసుకున్న తర్వాత కూడా పుష్పవల్లితో జెమినీ గణేషన్ ఎఫైర్ నడిపించాడు.

ప్రభుదేవా:
ప్రముఖ హీరోగా, కొరియోగ్రాఫర్ గా, డాన్సర్ గా,డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. తన భార్య రామలతా ఉండగానే సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార తో ఎఫైర్ నడిపించాడు. ఆ త‌ర్వాత ఆమెకు బ్రేక‌ప్ చెప్పాక ఇప్పుడు మ‌రో అమ్మాయిని పెళ్లాడాడు.

పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందినిని వివాహం చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ తో సహజీవనం చేశాడు. ఇక ఆమెను కూడా పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి మళ్లీ తీన్మార్ హీరోయిన్ అన్నా లెజనోవాతో ఎఫైర్ నడిపి పెళ్లి చేసుకున్నాడు.

అమీర్ ఖాన్:
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్ ఖాన్ తన భార్య రీనా దత్త ఉండగానే.. కిరణ్ రావు తో ఎఫైర్ నడిపాడు. ఇప్పుడు ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి త‌న‌కంటే వ‌య‌స్సులో చాలా చిన్న‌ది అయిన ఫాతిమా ష‌నా షేక్‌తో ఎఫైర్ న‌డుపుతున్నాడు.

హృతిక్ రోష‌న్‌:
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ముందు త‌న చిన్న‌నాటి ప్రియురాలు సుజానేఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చేసి కంగ‌నా ర‌నౌత్‌తో ఎఫైర్ న‌డిపాడు. ఇప్పుడు త‌న‌కంటే వ‌య‌స్సులో చిన్న‌దైన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news