Moviesరష్మిక మందన్న అలాంటి సాహసం చేస్తుందా..? గిల్లి గిచ్చించుకోవడం అంటే...

రష్మిక మందన్న అలాంటి సాహసం చేస్తుందా..? గిల్లి గిచ్చించుకోవడం అంటే ఇదేనా..?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా..ఈ మధ్య కాలంలో మరీ హద్దులు మీరుతుందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రష్మిక మందన పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు బాగా తెలిసిందె. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి రష్మిక మందన హవా ఎక్కువగా కొనసాగుతుంది. హిట్లు కొట్టకపోయిన సరే అమ్మడు అంటే ప్రాణం ఇచ్చేస్తున్నారు కొందరు జనాలు .

మరీ ముఖ్యంగా బాలీవుడ్లో అమ్మడికి విపరీతమైన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది . కాగా ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు ఏకంగా బికినీతో కూడా కనిపించడానికి సిద్ధపడిందంట రష్మిక మందన. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కొంచెం ఎక్స్పోజ్ చేయడానికి నానా కండిషన్లు పెట్టే రష్మిక మందన్నా.. బాలీవుడ్ లో మాత్రం మొత్తం విప్పడానికి సైతం సిద్ధపడింది అంటూ తెలుగు జనాలు మండిపడుతున్నారు .

అంతేకాదు గతంలో ఓ టాలీవుడ్ హీరో అడిగితే ఐటం సాంగ్ కి రిజెక్ట్ చేసిన రష్మిక మందన .. మహేష్ బాబు సినిమాకు మాత్రం ఓకే చేసింది . అంతే కాదు టాలీవుడ్ లో కూడా డైరెక్టర్ లు రష్మికకు బికినీ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇక్కడ బికినీ వేయని రష్మిక బాలీవుడ్ లో మాత్రం బికినీ వేయడానికి సిద్ధపడింది . ఈ క్రమంలోనే రష్మిక మందన తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నే గిల్లి గిచ్చించుకోవడం అంటారు జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news