Moviesఆర్తి అగర్వాల్ అంత చెత్త పని చేసిందా..? ఆ విషయం బయటకు...

ఆర్తి అగర్వాల్ అంత చెత్త పని చేసిందా..? ఆ విషయం బయటకు రాకుండా ఆ తెలుగు హీరోకి 10 లక్షలు ఇచ్చిందా..?

సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబుకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్న మోహన్ బాబు ..బయట చాలా డిసిప్లిన్ గల వ్యక్తిగా పాపులారిటీ దక్కించుకున్నాడు . అంతేకాదు ఇప్పటికి మోహన్ బాబుని చూస్తే ఇండస్ట్రీలో కొందరు హీరోలు హీరోయిన్లు గజగజ వణికి పోతూ ఉంటారు . దానికి మెయిన్ రీసన్ ఆయన ముక్కుసూటిగా మాట్లాడే తత్వమే . ఉన్నది ఉన్నట్లు ముఖానే మాట్లాడేసే మోహన్ బాబు .. కోపం వస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు . అవతల వ్యక్తి ఎంతటి వాడైనా సరే తప్పుచేస్తే ..షర్ట్ పట్టుకుని అడిగేసే టైప్ మోహన్ బాబు.

ఈ క్రమంలోనే గతంలో స్టార్ హీరోయిన్ చేసిన పనికి హార్ట్ అయిన మోహన్ బాబు ఏకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసి మరి ఆమె దగ్గర పది లక్షల ఫైన్ వసూలు చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ ఆర్తి అగర్వాల్ . పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అతి తక్కువ టైంలోనే సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆర్తి అగర్వాల్ మోహన్ బాబు తో సినిమాకు కమిట్ అయింది . కోదండరామి దర్శకత్వంలో తెరకెక్కిన ” తప్పుచేసి పప్పుకూడు” అనే వినోదభరితమైన సినిమాలో మొదటి హీరోయిన్గా నటించాల్సింది ఆర్తి అగర్వాల్ .

ఈ అగ్రిమెంట్లపై సైన్ కూడా చేసిందట . అప్పటికే 10 ప్రాజెక్టులు చేతిలో పెట్టుకున్న ఆర్తి ఈ సినిమాకి ఎలా సైన్ చేసిందో ఆ దేవుడికే తెలియాలి . అయితే కరెక్ట్ గా సినిమా షూట్ టైం అప్పుడు వేరే సినిమా షూట్ లో బిజీ కావడంతో ఆర్తి అగర్వాల్ ఈ సినిమా షూట్ నుంచి తప్పించుకోవడానికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటూ మోహన్ బాబుకు దొంగ సాకులు చెప్పిందట. మోహన్ బాబు కూడా నిజంగానే పరీక్షలు ఏమో అనుకుని లైట్ గా తీసుకున్నారట . అప్పుడే గ్రేసి సింగ్ హీరోయిన్ గా పెట్టుకున్నారు .

అయితే ఆ తర్వాత మోహన్ బాబుకు అసలు నిజం తెలిసింది . వేరే సినిమాలో హీరో కోసమే మోహన్ బాబును కించపరిచిందని.. ఆ సినిమాను రిజెక్ట్ చేసింది అని.. ఆ సినిమా షూటింగ్ నుంచి తప్పుకుంది అని తెలిసింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసి మరి ఆర్తి అగర్వాల్ పరువు తీసాడట . అంతేకాదు ఏకంగా 10 లక్షల రూపాయలు ఆమె చేత ఫైన్ కట్టించాడట . ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news