Movies"ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడు శ్రీను".. ఆ మాటకు అనసూయ అభిమానులకు...

“ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడు శ్రీను”.. ఆ మాటకు అనసూయ అభిమానులకు మండిపోయిన్నట్లుందే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్న ఆకతాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీ లు..సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీస్ టార్గెట్ చేస్తూ ఏ చిన్న విషయాన్ని అయినా సరే పెద్దదిగా చేసి చూపిస్తూ హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే రీసెంట్గా అనసూయ గెటప్ – శీను ల పేర్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మే డే సందర్భంగా అనసూయ నటిస్తున్న “విమానం ” సినిమాకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే చీరకట్టులో అనసూయ చాలా గ్లామర్ గా కనిపిస్తూనే చాలా న్యాచురల్ లుక్స్ లో ఆకట్టుకుంది . ఈ శారీలో అందర్నీ తెగ అట్రాంక్ట్ చేస్తుంది అనసూయ. ఈ క్రమంలోనే మొదటి నుంచి అనసూయ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న గెటప్ శ్రీను “ఆల్ ది బెస్ట్ అను” అంటూ కామెంట్ పెట్టాడు.

ఈ క్రమంలోనే గెటప్ శ్రీను పై గుర్రుగా ఉన్న ఓ హీరోయిన్ ఫ్యాన్స్ ఆయనను టార్గెట్ చేసి కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఆయన మెసేజ్ లో ఎలాంటి వల్గారిటికి లేనప్పటికీ కావాలనే ట్రోల్ చేస్తున్నారు . “పబ్లిక్ ప్లాట్ఫారంలో అను ఏంటి ..అనసూయ అని పిలవండి.. ఆమెకి ఓ రేంజ్ ఉంది ..ఆమెకు ఓ స్టేటస్ ఉంది.. మీ ఫ్రెండ్ షిప్స్ ఏదైనా ఉంటే తర్వాత చూయించుకోండి.. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అనూ అంటూ పిలవకండి అనసూయ అంటూ గౌరవం ఇవ్వండి” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు రెచ్చిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్ చెయ్ శ్రీను అంటున్నారు.

ఈ క్రమంలోనే గెటప్ శీను గతంలో ఓ హీరోయిన్ విషయంలో చేసిన కామెంట్స్ కారణంగానే ఆ హీరోయిన్ ఫ్యాన్స్ హాట్ గెటప్ శీను ని ఈ విధంగా టార్గెట్ చేసి ట్రొల్ చేస్తున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఏది ఏమైనా సరే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయం మాట్లాడాలి అన్న భయపడిపోతున్నారు సెలబ్రిటీలు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news