Moviesవారెవ్వ: ప్రభాస్ కు విలన్ గా గోపీచంద్.. అఫిషియల్ ప్రకటన...

వారెవ్వ: ప్రభాస్ కు విలన్ గా గోపీచంద్.. అఫిషియల్ ప్రకటన వచ్చేసిందోచ్..!!

గత కొంతకాలంగా హిట్ లేకుండా అల్లాడిపోతున్న మ్యాంచో షో హీరో గోపీచంద్ లేటెస్ట్ గా నటించిన సినిమా “రామబాణం “. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ టు ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరికెక్కింది. థియేటర్స్ లో కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ ని దట్టగా దట్టించి మరి రిలీజ్ చేశాడు డైరెక్టర్ శ్రీవాస్ .

గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన లక్ష్యం – లౌక్యం సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . ముచ్చటగా మూడోసారి కూడా హిట్ కొట్టాడు అంటున్నాడు గోపీచంద్ ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే ” రామబాణం ” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ ప్రభాస్ కి తనకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ విషయాలను బయట పెట్టాడు.

అంతేకాదు హోస్ట్ మళ్లీ “మీరు ప్రభాస్ సినిమాలో విలన్ గా నటిస్తారా..?” అన్న ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు . “ఖచ్చితంగా అవకాశం వస్తే నటిస్తాను .. ప్రభాస్ కు విలన్ గా నటిస్తానని.. కానీ వర్షం – జయం వంటి చిత్రాలలో విలనిజం ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో ఉన్న క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతాను . అలాంటి క్యారెక్టర్స్ వస్తే కచ్చితంగా ప్రభాస్ కి వలన్ చేస్తాను ” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే అఫీషియల్ గానే నేను విలన్ రోల్స్ చేయడానికి సిద్ధమంటూ ప్రకటించిన గోపీచంద్ మాటలు విని ఏదో ఒక డైరెక్టర్ ప్రభాస్కి విలన్ గా గోపీచంద్ ని సెలెక్ట్ చేయక పొతారా..? అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి గోపీచంద్ మాటలు చూస్తుంటే త్వరలోనే ప్రభాస్ – గోపీచంద్ ని ఒకే స్క్రీన్ పై చూడబోతున్నాం అని క్లారిటీ వచ్చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news