Moviesక‌స్ట‌డీ టాక్‌: కృతిశెట్టిని నిలువునా ముంచేసిన నాగ‌చైత‌న్య‌…!

క‌స్ట‌డీ టాక్‌: కృతిశెట్టిని నిలువునా ముంచేసిన నాగ‌చైత‌న్య‌…!

కుర్ర బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లోకి ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఉప్పెన‌లా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వ‌డంతో వ‌రుస‌గా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కృతికి వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఆమె ఏ హీరో సినిమాలో నటించిన ఆ సినిమా డిజాస్టర్ అవుతోంది. మధ్యలో నాగార్జున – నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన బంగార్రాజు సినిమా మాత్రమే సక్సెస్ అయ్యింది. హీరోయిన్గా చెప్పుకోదగ్గ సినిమాలు చేసిన కృతి మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాలేదు.

ఆమె తర్వాత వచ్చిన రష్మిక, శ్రీ లీల వరుసహిట్లతో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలతో దూసుకుపోతున్నారు. అయితే కృతి కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగానే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె నాగచైతన్యకు జోడిగా నటించిన కస్టడీ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ అయితే తనకు టాలీవుడ్ లో తిరుగు ఉండదని ఆశల పల్లకిలో ఊరేగిస్తూ వచ్చింది.

అయితే కస్టడీ సినిమాకు హిట్ టాక్ రాలేదు. యావరేజ్, బిలో యావరేజ్ అని మాత్రమే అంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టెక్క‌డం కష్టం అన్న టాక్ వినిపిస్తోంది. అటు నాగచైతన్య పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కృతి కస్టడీతో హిట్టు కొట్టి ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేయాలని ఎన్నో కలలు కంది.

అయితే ఆమె ఆశలు పెట్టుకున్న కస్టడీ బాక్సాఫీస్ దగ్గర కష్టం అన్న టాక్ వచ్చేసింది. చివరకు నాగచైతన్య అయినా కృతి కెరీర్‌ను మారుస్తాడు అనుకుంటే ఆమె ఆశలు అడియాసలు చేసేసాడు. మరి టాలీవుడ్ లో కృతిని కాపాడే ఆ హీరో ఎవరు ? ఆ హిట్ సినిమా ఆమెకు ఎప్పుడు దక్కుతుంది ? అన్నది కాలమే నిర్ణయించాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news