Moviesఎవ్వరూ ఊహించ‌ని క్రేజీ అప్‌డేట్‌... ఆ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ కొత్త...

ఎవ్వరూ ఊహించ‌ని క్రేజీ అప్‌డేట్‌… ఆ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ కొత్త సినిమా…!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న ఆదిపురుష్ ఆ వెంట‌నే స‌లార్‌, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మ‌రో కొత్త ప్రాజెక్ట్‌కు కూడా ప్ర‌భాస్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. పెద్ద ట్విస్ట్ ఏంటంటే అస‌లు ప్ర‌భాస్ ఆ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌రు.

ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తోన్న టైంలో మారుతి సినిమాకు ఓకే చెప్ప‌డం అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది. మారుతితో ప్ర‌భాస్ ఏ టైప్ సినిమా చేస్తాడో ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. ఇక ఇప్పుడు మ‌రో యంగ్ క్రేజీ డైరెక్ట‌ర్‌కు ప్ర‌భాస్ దాదాపు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌నే తెలుస్తోంది. ఆ యంగ్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు హ‌ను రాఘ‌వ‌పూడి. సునిశిత ప్రేమ‌క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అయిన హ‌ను రీసెంట్‌గా సీతారామం సినిమాతో పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు.

అస‌లు హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాలే చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. లై – అందాల రాక్ష‌సి – ప‌డిప‌డిలేచే మ‌న‌సు – కృష్ణ‌గాడి ప్రేమ‌గాథ – సీతారామం ఈ సినిమాలు చూస్తుంటేనే చాలా డిఫ‌రెంట్‌గా, కొత్త‌గా ఉంటాయ‌ని క్లీయ‌ర్‌గా తెలుస్తుంటుంది. అంటే ప్ర‌భాస్ వ‌రుస యాక్ష‌న్‌, పాన్ ఇండియా లైన‌ఫ్‌లో హ‌నుతో ఓ అదిరిపోయే ల‌వ్‌స్టోరీలో న‌టించేందుకు ఆస‌క్తి ఉన్న‌ట్టే తెలుస్తోంది.

అందుకే ఈ సునిశిత చిత్రాల ద‌ర్శ‌కుడికి ఓటేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సాలీడ్ ప్రాజెక్ట్ ఆల్‌మోస్ట్ క‌న్‌ఫార్మ్ అయ్యింద‌ని.. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది. ఈ ఇంట్ర‌స్టింగ్ కాంబోపై ఇప్ప‌టికే మంచి బ‌జ్ ఉంది. ఇదిలా ఉంటే వ‌చ్చే ఏడెనిమిది నెల‌ల్లోనే ప్ర‌భాస్ న‌టించిన మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆదిపురుష్ – స‌లార్ – సంక్రాంతికి ప్రాజెక్ట్ కే రానున్నాయి. దీంతో యంగ్‌రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కు మామూలు ఆనందం కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news