Moviesచెత్త రీజన్ తో బంగారంలాంటి ప్రభాస్ సినిమా ను మిస్ చేసుకున్న...

చెత్త రీజన్ తో బంగారంలాంటి ప్రభాస్ సినిమా ను మిస్ చేసుకున్న బన్నీ.. ఆ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే స్టార్ హీరోల విషయాలలో అవి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఓ స్టార్ చేయాల్సిన సినిమాను మరో స్టార్ హీరో చేసి హిట్ కొడితే ఆ బాధ వర్ణాతితం . అలాంటి బాధను అనుభవించిన టాలీవుడ్ స్టార్స్ ఎంతోమంది ఉన్నారు, ఆ లిస్టులోకే వస్తాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ ..ప్రజెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోయిన తర్వాత మరో స్టార్ డైరెక్టర్ తో పాన్ ఇండియా లెవల్ లో ఇంకో సినిమాను చేయడానికి సిద్ధపడుతున్నారు . ఇంత క్రేజీ కమిట్మెంట్ తో సినిమాలు చేసే బన్నీ తన వద్దకు వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాను చెత్త రీజన్తో రిజెక్ట్ చేసారట. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన “డార్లింగ్”.

ఈ సినిమా డైరెక్టర్ కరుణాకర్ ఈ సినిమాను మొదట చెప్పింది అల్లు అర్జున్ కే నట . అయితే సినిమాలో సీన్స్ చాలా స్లోగా వెళుతూ ఉండడం ..సినిమాలో ఎక్కడ మాస్ ఎలివేషన్స్ .. మాస్ కంటెంట్ లేకపోవడంతో అప్పుడు మాస్ అంటే ఎక్కువగా లైక్ చేసే బన్ని ఈ సినిమాను వద్దనుకున్నారట . అదే లవ్ స్టోరీ అంటూ ఈ సినిమా రిజెక్ట్ చేసారట . ఆ తర్వాత ఈ స్టోరీకి ప్రభాస్ సెలెక్ట్ అయ్యాడు . ఈ సినిమా ఎంతటి విజయం అందుకుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ప్రభాస్ కెరియర్ ని ఎలా మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పాలా..? అలా చేతులారా బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు బన్ని..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news