Movies"చచ్చేలోపు సాయిపల్లవి తో ఒక్కసారి అయినా అలా".. హీట్ పెంచేసిన స్టార్...

“చచ్చేలోపు సాయిపల్లవి తో ఒక్కసారి అయినా అలా”.. హీట్ పెంచేసిన స్టార్ హీరో బోల్డ్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మలర్ అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో ఫిదా అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సాయి పల్లవి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్దానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా హీరోయిన్ సాయి పల్లవి స్టార్ పొజిషన్ ని అందుకుంది .

ఈ క్రమంలోనే సాయి పల్లవికి బాలీవుడ్ హీరోస్ కూడా ఫిదా అయిపోయారు. ఆమె అందానికి ఆమె నటనకి బాలీవుడ్ స్టార్ హీరో ఫిదా అయ్యి ఓపెన్ గా కామెంట్ చేశారు . ప్రెసెంట్ అది బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా సరే సాయి పల్లవి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న న్యూస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య హీరోయిన్ సాయి పల్లవి అంటే తనకి ఇష్టం అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

ఓ ప్రైవేట్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయట పెట్టాడు . గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ..” నాకు సాయి పల్లవి అంటే చాలా చాలా ఇష్టం . ఆమె అంటే పిచ్చి.. ఎందుకో తెలియదు ఆమె సినిమాలు ప్రతి ఒక్కటే చూస్తాను. నాకు ఆమెపై ఉన్న పిచ్చి ఎంతగా ఉంది అంటే ఒక్కసారైనా ఆమెతో కలిసి నటించాలని ఆశగా ఉంది. కానీ ఆశ నెరవేరుతుందో లేదో నాకే తెలియదు . నా దగ్గర సాయి పల్లవి ఫోన్ నెంబర్ ఉన్న సరే ఆమెకు ఈ విషయం చెప్పడానికి భయపడి పోతున్నాను. క్రష్ అంటే సాయి పల్లవి తో నాకు సినిమాల పరంగా క్రష్ అంతే.. మరి ఏ సంబంధం లేదు “అంటూ బోల్డ్ గా స్పందించాడు . ఈ క్రమంలోనే సాయి పల్లవి పై గుల్షన్ దేవయ్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news