Moviesబిగ్ బ్రేకింగ్: "లాల్..భగవంత్ లాల్ కేసరి"..బాలయ్య-అనిల్ రావిపూడి టైటిల్ లీక్ అయిపోయిందోచ్.....

బిగ్ బ్రేకింగ్: “లాల్..భగవంత్ లాల్ కేసరి”..బాలయ్య-అనిల్ రావిపూడి టైటిల్ లీక్ అయిపోయిందోచ్.. మీసం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంత ఏజ్ వచ్చినా సరే టాలీవుడ్ యంగ్ హీరోస్ కి ధీటుగా సినిమాల్లో హీరోగా నటిస్తూ ఇప్పటికి తనదైన స్టైల్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు బాలయ్య అంటే ఆయన లో నటించే సత్తా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా రీసెంట్ గానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “వీర సింహారెడ్డి” అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ప్రజెంట్ మల్టీ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్బికె 108 అనే సినిమాలో నటిస్తున్నాడు .

ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కి సంబంధించిన కీలక అప్డేట్ సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా లీక్ అవుతూ ఫ్యాన్స్ కి సినిమాపై హైప్ పెంచేసింది. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సోషల్ మీడియాలో లీకై అభిమానులకు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది . మనకు తెలిసిందే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు . ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన టైటిల్ను ఫిలిం ఛాంబర్ లో కూడా రిజిస్ట్రేషన్ చేశారు . ఈ మధ్యలోనే సినిమా టైటిల్ లీక్ అయినట్లు తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాకి :భగవత్ లాల్ కేసరి” అనే టైటిల్ ఫిక్స్ చేశారట . ఈ సినిమాలో బాలయ్య పాత్ర పేరు కూడా “భగవత్ లాల్” అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే బాలయ్య ఈ సినిమాలో చాలా స్టన్నింగ్ లుక్స్ లో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు బాలయ్యను చూసిన ఏ గెటప్ లోను ఈ సినిమాలో మనం చూడలేమని.. బాలయ్యను మరో లెవల్ లుక్స్ లు అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఈ సినిమాలో బాలయ్య మీసం తో ఇంట్రెస్టింగ్ గా కధను మలిచాడట అనిల్ రావిపూడిదీంతో సోషల్ మీడియాలో ఎన్ ని కే 108 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news