Moviesబిచ్చగాడు 2 పబ్లిక్ టాక్: స్టొరీ హిట్ .. సినిమా...

బిచ్చగాడు 2 పబ్లిక్ టాక్: స్టొరీ హిట్ .. సినిమా ఫట్.. టోటల్ కధకి అదే మైనస్..!!

కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ తెలుగులో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బిచ్చగాడు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో లిస్టు లోకి యాడ్ అయిపోయిన విజయ్ ఆంటోని ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో చేసిన అంతటి క్రేజ్ ని సంపాదించుకోలేకపోయాడు . ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా బిచ్చగాడు 2 . కొద్దిసేపటి క్రితం ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది . కాగా విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా టాక్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా చూసి వచ్చిన జనాలు అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు..!!

కాగా బిచ్చగాడు సినిమాతో ఊహించని హిట్టు అందుకొని రాత్రికి రాత్రి స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ ఆంటోని.. బిచ్చగాడు 2 తో ఎలాంటి హిట్ అందుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తన భార్య ఫాతిమా నిర్మాతగా ఈ సినిమాను రూపొందించాడు విజయ్ ఆంటోని. మ్యూజిక్ ఎడిటింగ్ బాధ్యతలు కూడా తానే నిర్వర్తించడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాగా భారీ అంచనాల నడుము తెరకెక్కిన ఈ సినిమా 50 – 50 టాక్ తో వైరల్ గా మారింది . కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. బిచ్చగాడు చిత్రంలో తల్లిని కాపాడుకునేందుకు తప్పించే కొడుకుగా కనిపించిన విజయ్ ..ఈ సినిమాలో సత్య , గురుమూర్తి అనే రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు.

ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది . సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ తల్లి సెంటిమెంట్ కనిపించదు . ఇది బిచ్చగాడు 2 అని చెప్పిన ఇది సీక్వెల్ కాదు ..కొత్త స్టోరీనే..కానీ కథను బాగా మార్చేశారు డైరెక్టర్ . ఈ స్టోరీలో బిక్షం ఎత్తుకునే పిల్లలను కిడ్నాప్ చేసి బడా మనుషులు వారితో ఏం చేస్తున్నారు అనే విషయం క్లియర్ గా చూపించారు. నేటి సమాజానికి రియాలిటీకి దగ్గరగా ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అయితే సినిమాలో కథ ఉన్న ఆ కథను జనాలకు అర్థం చేసే తీరులో డైరెక్టర్ ఫ్లాప్ అయ్యాడు అని అంటున్నారు .

పిల్లలతో సీన్లు ఓకేగా ఉన్న వివి ఎఫెక్ట్స్ లో క్వాలిటీ లేదు అని.. డబ్బు ఖర్చుపెట్టిన దాని ప్రయోజనం లేకుండా పోయింది అని చెప్పుకొస్తున్నారు .. స్క్రీన్ ప్లే చాలా చాలా డల్ గా ఉందని.. చాలా స్లోగా సినిమా ముందుకెళ్తుందని ..ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదని చెప్పుకొస్తున్నారు.. ఆంటీ బికిలి ఐడియా బాగున్నప్పటికీ ఎక్కడ ఎగ్జిక్యూషన్లో అంత సక్సెస్ కాలేకపోయారని తెలుస్తుంది . అంతేకాదు సినిమా మొత్తంలో ఒకటి రెండు ఇంట్రెస్టింగ్ సీన్లు తప్పిస్తే ఎక్కడా కూడా పెద్దగా చెప్పుకోతగ్గ ఎమోషనల్ సీన్స్ లేవని చెప్పుకొస్తున్నారు . దీంతో బిచ్చగాడు 2 సినిమా సగం పాజిటివ్ కామెంట్స్.. సగం నెగటివ్ కామెంట్స్ తో దూసుకుపోతుంది. చూడాలి మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాద్ధిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news