Movies"అందుకే సుధీర్ గాడు రష్మిని వదిలేసాడు"..అందరి ముందు అసలు విషయాని బయట...

“అందుకే సుధీర్ గాడు రష్మిని వదిలేసాడు”..అందరి ముందు అసలు విషయాని బయట పెట్టిన జబర్దస్థ్ కమెడియన్..!!

బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న ఇమ్మానుయేల్ .. లేడీ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న వర్ష కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ అనే షో లో స్కిట్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. కేవలం జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తమదైన స్టైల్ లో స్కిట్స్ వేసి అలరిస్తున్నారు. కాగా రీసెంట్గా జబర్దస్త్ స్టేజ్ పై వీళ్ళు చేసిన స్కిట్ నవ్వులు పూయించింది . అంతేకాదు ఫన్నీగా మాట్లాడుతున్నా సరే ఎక్కడో సుధీర్ – రష్మీ అభిమానులకు నిజాన్ని తెలియజేశాడు ఇమ్మానుయేల్ అని అందరికి అనిపించింది.

కాగా స్కిట్లో భాగంగా ఇమాన్యుయల్ దేవదాస్ గా ఉంటాడు . పార్వతిగా వర్ష కనిపిస్తుంది. ఈ క్రమంలో స్కిట్లో భాగంగా డైలాగ్స్ చెప్తూ..” ఏంటో నా తలరాత.. వర్ష మాత్రం ప్రేమించడం లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.. అంటూ చేతిలో కుక్కపిల్లని పట్టుకుని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశాడు.”. అంతేనా..” నా తల రాత నీకు చెప్పుకుందామంటే ఇద్దరి తలరాతలు ఒక్కటే, సుధీర్ అక్కడ, నేను ఇక్కడ అంటూ రెచ్చిపోయాడు. దీనికి రష్మి గౌతమ్‌ నవ్వుతూ రియాక్ట్ అయ్యింది.

దీంతో రష్మి-సుధీర్ నిజంగానే ప్రేమించుకుంటున్నారని .. కొన్ని కారణాలవల్లే దూరం దూరంగా ఉంటున్నారు అని .. మరోసారి సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయిపోతున్నాయి. తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ ఇమ్ము మాత్రం ఆ విషయం పక్కాగా చెప్పేశాడు. రష్మి – సుధీర్ దూరంగా ఉంటే జనాలు లైక్ చేయరని .. వాళ్ళిద్దరూ దగ్గరగా ఉంటేనే షో కి టీఆర్పి రేటింగ్స్ బాగా వస్తాయి అని.. వాళ్ళ మధ్య రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అంటూ సుధీర్ – రష్మీ ఫ్యాన్స్ చెబుతున్నారు . చూడాలి మరి ఈ జంట అభిమానుల కోసం ఎప్పుడు జంటగా కనిపిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news