Moviesవారెవ్వ: రాజమౌళి కెరీర్ లోనే మరో అద్భుతం.. ఏం అదృష్టం రా...

వారెవ్వ: రాజమౌళి కెరీర్ లోనే మరో అద్భుతం.. ఏం అదృష్టం రా బాబు ..ఎక్కడో మచ్చ ఉంది..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి డైరెక్టర్గా అడుగుపెట్టిన రాజమౌళి నిన్న కాకమొన్న తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఎలాంటి కంటెంట్ ని జనాలకి అందించాడో.. ఏ విధమైన డైరెక్షన్ ను నమ్ముకుంటున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తాను తీసిన కథకు కర్త – కర్మ – క్రియ.. అన్ని తానై పోషించి సినిమాని బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిల్చోపెట్టే బాధ్యత తీసుకున్న రాజమౌళి ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు అందుకున్న చరిత్రను కూడా నమోదు చేసాడు.

ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రీసెంట్ గానే అమెరికాలో గ్రాండ్గా ఆస్కార్ అవార్డు అందుకుంది . దీంతో కోట్లాదిమంది ఇండియన్స్ కల కూడా నెరవేర్చేసాడు రాజమౌళి . ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను సాధించుకొని ఇండియాలోనే ఫస్ట్ డైరెక్టర్ గారి సంచలన రికార్డు నెలకొల్పాడు . ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న రాజమౌళి టైమ్స్ జాబితాలోను చోటు చేసుకోవడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది .

రీసెంట్గా రాజమౌళి టైమ్స్ జాబితాలోని చోటు చేసుకున్నారు . ఇప్పటివరకు ఏ ఇండియన్ సాధించని ఘనత అందుకుని.. టాప్ 100 లో ఒకరిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డును ఇండియన్ డైరెక్టర్స్ ఎవరు నమోదు చేసుకోకపోవడం గమనార్హం. కాగా ప్రజెంట్ రాజమౌళి .. మహేష్ బాబుతో ఓ సినిమాను తీయడానికి రెడీ చేసుకుంటున్నారు . ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సర వేగంగా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాని దాదాపు 2000 కోట్లు పెట్టి తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news