Moviesశాకుంతలం పబ్లిక్ ఒపీనియన్: సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ ఇదే.. పాపం అందుకు...

శాకుంతలం పబ్లిక్ ఒపీనియన్: సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ ఇదే.. పాపం అందుకు కూడా పనికి రాలేదే..?

తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది . మరీ ముఖ్యంగా రిలీజైన ఫస్ట్ షో తోనే ఇలాంటి టాక్ సంపాదించుకోవడం సమంత కెరియర్ లోనే ఫస్ట్ టైం. అంతేకాదు గుణశేఖర్ క్యాస్ట్ అండ్ క్రూ ని సెలెక్ట్ చేసుకోవడంలో సైతం విఫలమయ్యారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అసలు ఈ సినిమాలో దేవ్ మోహన్ క్యారెక్టర్ ఏమన్నా ఉందా ..? అతని మొహం లో ఎక్స్ప్రెషన్స్ తెలుస్తున్నాయా..? మన తెలుగు హీరోలను పెట్టి ఉండచ్చు కదా అంటూ చెప్పుకొస్తున్నారు .

మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఏ పాత్రకి ఎవరిని చూస్ చేసుకోవాలో కూడా గుణశేఖర్ కి తెలియలేదు అంటూ మండిపడుతున్నారు . అంతేనా సినిమా ముందు నానా హంగామా చేసిన గుణశేఖర్ సినిమా చూస్తే అలాంటిది ఏమి లేవు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తాయి. మ్యూజిక్ పరంగా పర్లేదు అనిపించిన శాకుంతులం సినిమా నటనపరంగా కూడా నెగిటివ్ రివ్యూలు అందుకుంటుంది . అంతేనా మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎవరి రోల్ ఎక్కడ తీసేస్తున్నాడు ..ఎవరిదో ఎక్కడ ఇంటర్ ఫీర్ చేస్తున్నారు తెలియలేదు.

దేవ్ మోహన్ సమంత రొమాన్స్ మాత్రం బాగా డీప్ గా చూపించిన గుణశేఖర్ .. అసలు వాళ్ళ ప్రేమ పుట్టడానికి కారణమైన ఎలిమెంట్స్ ని మిస్ చేశాడు. ప్రేమ వేరు శృంగారం వేరు అన్న కోణాన్ని చూపించడంలో గుణశేఖర్ డిజాస్టర్ అయ్యారు . మ ముఖ్యంగా సమంత శాకుంతలం సినిమా చూస్తే తలనొప్పులు పక్కా అంటున్నారు జనాలు. ఓవర్ ఆల్ గా ఈ సినిమాలో దేవ్ మోహన్ ని బిస్కెట్ కరెక్ట్ చేసేసాడు గుణశేఖర్ . ఇంకా పక్కాగా చెప్పాలంటే .. సమంత కంటే ఈ సినిమాలో అల్లు అర్హా నే బాగా నటించింది అంటూ చెబుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news