Moviesపుష్ప 2 టీజ‌ర్‌... సుకుమార్‌పై కొత్త సందేహాలు... తెలివి తెల్లారిన‌ట్టే ఉంది..!

పుష్ప 2 టీజ‌ర్‌… సుకుమార్‌పై కొత్త సందేహాలు… తెలివి తెల్లారిన‌ట్టే ఉంది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఏకంగా మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్ లో ఎండింగ్లో మాత్రమే అల్లు అర్జున్ ఎలా ఉంటాడో ? చూపించారు. అయితే పుష్ప 2పై అంచనాలు పెంచేందుకు సుకుమార్ బాహుబలి 2 స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నట్టే కనిపిస్తోంది. బాహుబలి సినిమాకు అంత ఆదరణ రావడానికి కట్టప్ప బాహుబలిని ఎందుకు ? చంపాడు అన్న సస్పెన్స్ బాగా వైరల్ అయింది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఒక బహిరంగ సభ‌లోలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే జనం చప్పట్లు కొట్టారంటే అంత బాగా జనాల్లోకి వెళ్ళింది.

అందుకే సుకుమార్ పుష్ప 2కు కూడా జాతీయస్థాయిలో అంతే బజ్‌ తేవడానికి వేర్ ఈజ్‌ పుష్ప ? అనే ప్రశ్నను ప్రచార అస్త్రంగా పెట్టుకున్నాడు.. అంతవరకు బాగానే ఉంది. ఇక మూడు నిమిషాల పాటు సుదీర్ఘంగా ఉన్న టీజర్ లో అరవ డబ్బింగ్ సినిమాలను తలపించే విధంగా ఆ టీవీ వార్తల బిట్లు అన్ని కలిపి ఊదరగొట్టాడు. వేర్ ఈజ్‌ పుష్పా ? అన్న స‌స్పెన్స్ చూశాక‌ సుకుమార్ పనితనం మీద బాగా నమ్మకం ఉన్నవాళ్లందరికీ మబ్బులు తొలగిపోయినట్టుగా టీజర్ ఉంది.

రేపు సినిమా ఎలా ఉంటుంది ? సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ సుకుమార్ అంటే ఒక సిగ్నేచర్, ఒక స్టైల్.. ఒక ఇంటిలిజెన్స్ ఇలా చాలా ఉంటాయి. అవన్నీ వదిలేసి ప‌ర‌మ రొటీన్ స్టైల్ లో ఈ టీజర్‌ను కట్ చేసినట్టుగా ఉంది. బాహుబలి 2 విషయంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు ?చంపాడు అనే ప్రశ్నకి సమాధానం దొరకక జనాల్లో ఆసక్తి పెరిగింది.

పైగా బాహుబ‌లి 2లో క‌ట్ట‌ప్ప పాయింట్‌ చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఉంది. అయితే పుష్ప‌ 2 విషయంలో ఇప్పుడు అది లేదు. వేర్ ఈజ్ పుష్ప అని ఊరిస్తూ వ‌చ్చి చివర్లో వేర్ ఈజ్‌ పుష్పకి జవాబు చెప్పేయటమే ఇక్కడ పెద్ద మైనస్ అయింది. అందుకే ఇప్పుడు సుకుమార్ లాంటి మేధావి తలలో నుంచి వచ్చిన ఆలోచన ఇదేనా అని… సుకుమార్ తెలివి తెల్లారిన‌ట్టే ఉంద‌ని చాలామంది నిట్టూరుస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news