Moviesచైతుతో పెళ్లి, విడాకులు... అవి చీక‌టి రోజులు అంటూ మ‌ళ్లీ టార్గెట్...

చైతుతో పెళ్లి, విడాకులు… అవి చీక‌టి రోజులు అంటూ మ‌ళ్లీ టార్గెట్ చేసిన సమంత‌

అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ అయిన సమంత జీవితంలో ఏ మాయ చేసావే సినిమా నిజంగానే మాయ చేసేసింది. ఇద్దరి కెరీర్‌ను ఒక రేంజ్ లో మలుపు తిప్పిన ఈ సినిమాతోనే వారిద్దరి ప్రేమాయణం మొదలైంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరో నాలుగు సినిమాలలో నటించారు. అసలు వెండితెరపై చైతు – సమంత కలిసి నటిస్తున్నారు అంటే ఒక క్రేజ్ ఉండేది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి మజిలీ సినిమాలో మెప్పించారు.

అసలు ఈ జంటను చూసి ముచ్చట పడని వారు లేరంటే అతియో శక్తి కాదు. అయితే విధి ఆడిన వింత నాటకంలో వీరిద్దరూ విడిపోయారు. నాలుగేళ్ల కాపురం తర్వాత 2021 అక్టోబర్లో తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు ఇద్దరు కలిసి ప్రకటించారు. ఈ నిర్ణయంతో అటు అక్కినేని అభిమానులు.. ఇటు సమంత అభిమానుల మనసు ముక్కలైంది. తాము ఎంతగానో అభిమానించే జంట ఇక కలిసి ఉండబోరన్న నిర్ణయం వారిని ఎంతో నిరాశకు గురిచేసింది.

విడాకుల తర్వాత సమంత తిరిగి సినిమాలలో రీయంట్రీ ఇచ్చి ఎక్కడా వెనక్కు తగ్గకుండా దూసుకుపోతున్నారు. పైగా మరింత హాట్ హాట్గా కనిపించేందుకు తాపత్రయ పడుతోంది. తాజాగా ఆమె నటించిన శకుంతలం సినిమా ప్రమోషన్లలో చైతన్యతో వివాహం, విడాకులు తనపై జరిగిన ట్రోలింగ్ పై ఆమె ఘాటుగా స్పందించింది. చైతుతో పెళ్లి, విడాకులు అనేవి నా జీవితంలో చీకటి రోజులు.. ఆ టైంలో తనకు పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తూ ఉండేవి.. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకుని నా మనసుకు నచ్చినట్లు నేను రియాక్ట్ అయ్యి ముందడుగు వేశానని సమంత స్పష్టం చేసింది.

ఈ కష్ట సమయంలో నా కుటుంబ సభ్యులు, మిత్రులు చాలామంది నాకు అండగా నిలబడ్డారని.. అయితే ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నా.. కాకపోతే గతంతో పోలిస్తే ఆ చీకటి రోజులు కొంతవరకు తగ్గాయని సమంత తెలిపింది. కష్టాలు ఎదురైనప్పుడు అక్కడే మనం చిక్కుకుపోయి ఉండకూడదని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని బయటపడాలని సమంత చెప్పింది. ఏదేమైనా మ‌రోసారి చైతును సమంత ప‌రోక్షంగా టార్గెట్ చేసిన‌ట్టుగానే ఆమె మాట‌లు ఉన్నాయి. ప్రస్తుతం సమంత ఖుషి సినిమాతో పాటు ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news