Movies' శాకుంత‌లం ' డిజాస్ట‌ర్‌పై తొలిసారిగా స్పందించిన స‌మంత‌... వామ్మో ఈ...

‘ శాకుంత‌లం ‘ డిజాస్ట‌ర్‌పై తొలిసారిగా స్పందించిన స‌మంత‌… వామ్మో ఈ కామెంట్ ఏంద‌మ్మో..!

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా శాకుంతలం. దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఈనెల 14న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో దుష్యంతుడిగా నటించగా.. సమంత శకుంతలగా కనిపించారు. అయితే ఈ సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకోలేదు.

పైగా సమంత లాంటి స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు వస్తాయని అనుకుంటే.. కనీసం మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేదు. తొలిరోజు నుంచి సినిమాకు భారీ ఎత్తున నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో తొలిరోజు మార్నింగ్ షోకే కలెక్షన్లు లేవు. సమంత చివరకు కన్నీళ్లు పెట్టుకున్నా… ప్రమోషన్లతో హైప్‌ క్రియేట్ చేసినా ఒక ఎపిక్ డిజాస్టర్ గా శాకుంతలం మిగిలిపోయింది. కథ, కథనాలతో పాటు సినిమాలో శకుంతల – దుష్యంతుల కెమిస్ట్రీ, డబ్బింగ్ ఇలా అన్ని విషయాలలోనూ ఈ సినిమా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది.

దీంతో ఇప్పుడు ఈ సినిమాతో పాటు సమంతపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజాస్టర్ అవడంపై సమంత తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించింది. సమంత ఇన్ డైరెక్టుగా భ‌గ‌వ‌ద్గీత‌లోని ఒక పోస్ట్ కూడా పెట్టింది. స‌మంత పెట్టిన ఆ పోస్టుకు అర్థం ఇలా ఉంది.

కర్మ ఫలితం మన చేతుల్లో ఉండదు.. ప్రయత్నం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. దాని ఫలితం ఎలా ? ఉంటుంది అనేది మనం నిర్ణయించే లేము. ప్రస్తుత ఫలితాలకు భయపడి మనం భవిష్యత్తులో ప్రయత్నం చేయటం మానకూడదు.. మనం ముందుకు సాగిపోవాలి.. అంటూ వేదాంత ధోరణిలో సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్ లో బాగా వైరల్ అవుతుంది. ఏదేమైనా స‌మంత శాకుత‌లం డిజాస్ట‌ర్ నుంచి కోలుకుని వెంట‌నే ట్రాక్ ఎక్కేందుకు ట్రై చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news