Moviesనమ్మించి ముంచేసిన రష్మిక .. హర్ట్ అయిన రౌడి హీరో ఏం...

నమ్మించి ముంచేసిన రష్మిక .. హర్ట్ అయిన రౌడి హీరో ఏం చేసాడో తెలుసా.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఖుషి . శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్ర పోషిస్తుంది . ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. సమంత మయోసైటిస్ అనే వ్యాధికి గురవడం కారణంగా సినిమా షెడ్యూల్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ షూట్ ప్రారంభం కానుంది . ఈ క్రమంలోనే సినిమాలో నటించే హీరో విజయ్ దేవరకొండ కేరళలో బోట్ రైడ్ ను ఎంజాయ్ చేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు .

అయితే విజయ్ దేవరకొండ దగ్గర నుంచి ఏ వీడియో వచ్చిన జనాలు ఎప్పుడూ పూనకాలతో ఊగిపోయేవాళ్ళు. కానీ ఈసారి ఎందుకో విజయ్ దేవరకొండ ఫేసులో సీరియస్ నెస్ ఎక్కువగా కనిపించింది . ఏదో కోల్పోతున్నాడు ఏదో కోల్పోయాడు అన్న బాధ .. ఎవ్వరూ లేరు అన్న దిగులు .. ఫేస్ లో ఎక్కువగా కనిపించింది . ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ను రష్మిక మందన హార్ట్ చేసిందని.. నమ్మించి మోసం చేసింది అంటున్నారు ఫాన్స్ . రీసెంట్గా రష్మిక మందన – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో దిగిన ఫొటోస్ ఇండస్ట్రిలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

విజయ్ దేవరకొండ తో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్న అంత క్లోజ్ గా ఎప్పుడు మూవ్ అవ్వలేదు . దీంతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని సాయితో ఎందుకు అంత క్లోజ్ గా మూవ్ అయింది అంటూ జనాలు చర్చించుకుంటూ ఉన్నారు . మరి కొందరు వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే రష్మిక – విజయ్ కు బ్రేకప్ చెప్పేసిందని.. కొత్త బాయ్ ఫ్రెండ్ ని పట్టింది అంటూ పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి . ఇవన్నీ విన్న విజయ్ దేవరకొండ కేరాళాలో ఇలా సింగిల్గానే రైడ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ సినీ ఇండస్ట్రీలో ఉండే జనాలు అభిప్రాయపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news