Moviesపుష్ప టీజర్ లో రష్మిక లేకపోవడానికి కారణం ఇదే..సుక్కు క్లారిటీ లో...

పుష్ప టీజర్ లో రష్మిక లేకపోవడానికి కారణం ఇదే..సుక్కు క్లారిటీ లో ఏదో మిస్ అయ్యిందే..?

టాలీవుడ్ స్టైల్ స్టార్ హీరో అల్లు అర్జున్ .. రష్మిక మందన హీరోయిన్గా నటించిన సినిమా పుష్ప . సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17 న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది .అప్పట్లో ఈ సినిమా సంచలనంగా మారింది . రీసెంట్ గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా అంతకు ముందు రోజు బన్నీ నటిస్తున్న పుష్ప2 సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే సినిమాలో మూడు నిమిషాలు గల టీజర్ లో ఎక్కడ హీరోయిన్ గురించి ప్రస్తావన రాకపోవడం.. హీరోయిన్ ని చూపించకపోవడం .. ఇదే క్రమంలో సుకుమార్ కి రష్మిక కి మధ్యన పర్సనల్ గొడవలు ఉన్నాయని .. ఆ కారణంగానే రష్మికను టీజర్ లో కట్ చేశారన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది .

అయితే అలాంటిది ఏదీ లేదని .. సుకుమార్ సన్నిహితులకు క్లారిటీ ఇచ్చాడట . బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్న టీజర్ కావడంతో టోటల్ ఫోకస్ బన్నీపై చేసామని ..అసలు ఈ టీజర్ లో రష్మిక ప్రస్తావన రావడానికి ఛాన్స్ లేదు అని.. కచ్చితంగా నెక్స్ట్ అప్డేట్ లో రష్మికకు సంబంధించి అదిరిపోయి లుక్ ను రిలీజ్ చేస్తామంటూ చెప్పుకోచ్చారట . ఈ క్రమంలోని రష్మిక ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి సుక్కు ఇలా చెప్పాడు కానీ .. సుక్కు ఆన్సర్ లో క్లారిటీ మిస్ అయింది అంటున్నారు ఫ్యాన్స్.

మూడు నిమిషాల టీజర్ లో ఒక్క సెకండ్ చాలు రష్మికను చూపించడానికి అంటూ ఫైర్ అవుతున్నారు . ఒకవేళ నువ్వు చెప్పింది నిజం అనుకున్న నువ్వు బన్నీను కూడా ఎక్కువగా చూపించలేదు కదా.. కేవలం ఒకే ఒక్కషాట్ చూపించావు.. రష్మికను చూయించడానికి ఎందుకంత ఇబ్బంది అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప2 లో రష్మిక పాత్ర ఆమె ఫ్యాన్స్ కు మింగుడు పడని ప్రశ్నగా మిగిలిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news