Moviesనాని కంటే అఖిల్ గొప్ప పెద్ద హీరోనా... ఇంత‌క‌న్నా కామెడీ ఉందా...!

నాని కంటే అఖిల్ గొప్ప పెద్ద హీరోనా… ఇంత‌క‌న్నా కామెడీ ఉందా…!

ఎస్ ఇప్పుడు ఇదే సందేహం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. నాని ఎక్కడ ? అఖిల్ ఎక్కడ.. నానికి 30 సినిమాలు చేసిన అనుభవం ఉంది. ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి మంచి హీరోగా నిలదొక్కుకున్నాడు. అటు కథల ఎంపికలో మంచి అనుభవం ఉంది. ఇక తన సహజ సిద్ధమైన నటనతో నేచురల్ స్టార్ అన్న బిరుదు కూడా సొంతం చేసుకున్నారు. పైగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అనుభవం ఉండడంతో సినిమా ఎలా ? వస్తుంది డైరెక్టర్ ఎలా తీస్తున్నాడు ? అన్నది క్లారిటీగా చూసుకుంటాడు.

నాని ప్రతి సినిమాకు దమ్మున్న కథలు ఎంచుకుంటున్నాడు. నాని సినిమా కొన్నవారు భారీగా నష్టపోవడం లేదు. అంటే సుందరానికి – శ్యాం సింగరాయ లాంటి సినిమాలకు రెండు మూడు కోట్లకు మించి నష్టాలు రాలేదు. అంటే నాని ఎలాగైనా బ్రేక్ ఈవెన్ దగ్గరికి తన సినిమాను తీసుకువెళతాడు. తాజాగా వచ్చిన దసరా సినిమా నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాకు మొత్తం రు. 70 కోట్ల బడ్జెట్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను రు. 24 కోట్లకు హోల్‌సేల్గా అమ్మేశారు.

చివరికి మారుబేరాలు జరిగి అది ఏపీ, తెలంగాణలో రు. 30 కోట్లకు చేరుకుంది. ఇక ఏజెంట్ సినిమాను ఏకంగా రు. 32 కోట్ల రేషియోలో హోల్‌సేల్గా అమ్మేశారు. ఆంధ్రాలో దసరా సినిమా రు. 12 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేస్తే ఏజెంట్ ఏకంగా రు. 15 కోట్లకు పైగా మార్కెట్ చేశారు. చివరకు నైజాంలో ఏజెంట్ సినిమాను రు. 12 కోట్లకు అమ్ముతామని అంటున్నా ఎవరు కొనేందుకు ముందుకు రావడం లేదు.

సినిమా ఎలా ? ఉంటుందో అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. నాని లాంటి స్టార్ హీరో వరుస హిట్లు ఉంటేనే.. అది కూడా నాని కెరీర్లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన దసరాను ఆంధ్రాలో 12 కోట్లకు అమ్మారు. అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిది ఏళ్లు అవుతుంది. కెరీర్లో సరైన హిట్ లేదు. మరి ఏజెంట్ సినిమాను ఏ లెక్కన రు. 15 కోట్లకు ఆంధ్రాలో అమ్మారో ఎవరికి అర్థం కావడం లేదు. నాని కంటే అఖిల్ అంత పెద్ద గొప్ప హీరో అయిపోయాడా ? ఈ కామెడీ అంచనాలు ఏంటో ఎవరికీ తెలియటం లేదన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news