Moviesఏజెంట్‌పై నాగార్జున‌కే న‌మ్మ‌కాలు లేక ఇంత ప‌ని చేశాడా...!

ఏజెంట్‌పై నాగార్జున‌కే న‌మ్మ‌కాలు లేక ఇంత ప‌ని చేశాడా…!

పాపం ఏ ముహూర్తాన అఖిల్‌ను హీరోగా పరిచయం చేశాడో కానీ నాగార్జునకు అస్సలు కంటిమీద కునుకు లేకుండా పోతుందట. నాగార్జున.. వినాయక్‌ని ఎంతో నమ్మి అఖిలను చేతిలో పెడితే అఖిల్ లాంటి డిజాస్టర్ సినిమా తీసి చేతుల్లో పెట్టాడు. ఆ సినిమా దెబ్బతో అఖిల్ పరువు అంతా పాతాళంలో కలిసింది. ఆ తర్వాత తన బ్యానర్ లోనే హలో సినిమా చేస్తే చివరకు అఖిల్ కు హిట్ రావడానికి ఆరేళ్లు పట్టింది.
అది కూడా అంతంత మాత్రం హిట్.

ఇక ఇప్పుడు అనిల్ సుంకర బ్యానర్లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి రెండేళ్లు దాటుతోంది. రోజు ఓ కథ చెప్పి చెట్టు ఎక్కి కూర్చునే విక్రమార్క బేతాళ కథ‌లా ఈ సినిమా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే ఎన్నోసార్లు రిలీజ్ డేట్లు ప్రకటించి వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఈనెల 28న రిలీజ్ అంటూ ఇప్పటికే చెప్పేశారు. అయితే ఇంకా షూటింగ్ బకాయి ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు పాటలు వదలటం మినహా ప్రచారం కూడా ప్రారంభించలేదు. ఆ రెండు పాటలు కూడా మరి అద్భుతంగా అయితే లేవు. సరైన హిట్ లేని హీరో.. కేవలం డైరెక్టర్ కాంబినేషన్ నమ్మి రు. 80 కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాత అనిల్ సుంకర. ఓవైపు కచ్చితంగా ఈనెల 28న సినిమా రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. అయితే ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక పాట కూడా షూటింగ్ చేయాల్సి ఉందని.. కాదు రెండు పాటలు షూటింగ్ ఉందని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.

ఇంకా సిజీ పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. రీ రికార్డింగ్ కూడా అవ్వలేదని.. ఇవన్నీ పూర్తయ్యాక అసలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకెన్ని రోజులు పడతాయో ఎవరికీ ? అర్థం కావడం లేదు. ఇక ఈ సినిమా గురించి ఇప్పటికే అవుట్ పుట్ చూసిన నాగార్జున సినిమాపై నమ్మకం లేక పూర్తిగా గాలికి వదిలేసినట్టు కూడా తెలుస్తోంది.

నిర్మాత అనిల్ సుంకరకు కూడా ఈ సినిమాపై పెద్దగా ఆశలు లేవని.. అందుకే ఆయన కూడా అమెరికాలో ఉంటూ ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా అఖిల్ ఏజెంట్ ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 28 కి ఈ సినిమా రాకపోతే అసలు ఎప్పుడు ?వస్తుందో కూడా ఎవరికీ అర్థం కాని దుస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news